వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ కొత్త ప్రధాని జాన్ కాస్టెక్స్.. మున్సిపోల్స్ ఓటమితో ఫిలిప్ రాజీనామా.. కరోనా కట్టడిలో ఫేమ్..

|
Google Oneindia TeluguNews

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫ్రాన్స్ రాజకీయాల్లో భారీ మార్పులకు కారణమయ్యాయి. ప్రెసిడెంట్ ఎమ్మానుయెల్ మాక్రాన్ నేతృత్వంలోని లెఫ్ట్ వింగ్ పార్టీకి.. ప్రత్యర్థి గ్రీన్ పార్టీ కంటే తక్కువ ఓట్లు రావడంతో పదవుల ప్రక్షాళన చేపట్టారు. అందులో భాగంగా ప్రధానమంత్రి పదవికి ఎడ్వర్డ్ ఫిలిప్ శుక్రవారం రాజీనామా చేశారు. మూడేళ్లపాటు ఆయనా పదవిలొ కొనసాగారు.

కరోనా విలయం: కిమ్ దేశంలో ప్రశాంతం.. మహమ్మారిపై ఉత్తర కొరియా ఘనవిజయం.. స్కూళ్లు రీఓపెన్..కరోనా విలయం: కిమ్ దేశంలో ప్రశాంతం.. మహమ్మారిపై ఉత్తర కొరియా ఘనవిజయం.. స్కూళ్లు రీఓపెన్..

ఎడ్వర్డ్ రాజీనామా ఆమోదించిన కొద్దిసేపటికే.. కొత్త ప్రధానమంత్రిగా జాన్ కాస్టెక్స్ ను నియమిస్తూ అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. గతంలో ప్రభుత్వాధికారిగా విశేష సేవలు అందించిన కాస్టెక్స్.. ఇటీవలి కరోనా విలయం సందర్భంలోనూ సత్తా చాటుకున్నారు. వైరస్ పుట్టిన కొత్తలో చైనా, ఇటలీ, స్పెయిన్ తర్వాత బాగా ఎఫెక్టయిన ఫ్రాన్స్.. కొద్ది కాలంలోనే కోలుకోవడానికి కారణం కాస్టెక్స్ రూపొందించిన స్ట్రాటజీలే అని స్థానిక మీడియా పేర్కొంది.

 Jean Castex became new PM to France after Philippe resigns

ప్రధానమంత్రిగా జాన్ కాస్టెక్స్ నియామకంతోపాటు మంత్రివర్గం మొత్తాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్లు ప్రెసిడెంట్ మాక్రాన్ తెలిపారు. కొత్త నియామకాలకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుంది. కరోనాకు సంబంధించి ఫ్రాన్స్ లో మొత్తం 1.66లక్షల కేసులు నమోదుకాగా, దాదాపు 30 వేల మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 60వేలుగా ఉంది. మే మొదటి వారానికే కొత్త కేసుల నమోదు తగ్గిపోయింది. మార్చి 15న మొదటి దశ పోలింగ్ తర్వాత నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలు జూన్ 28నాటి రెండో దశ పోలింగ్ తో ముగిశాయి. ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడం ప్రధాని మార్పునకు కారణమైంది.

English summary
French President Emmanuel Macron has named Jean Castex, who coordinated France's reopening strategy after the coronavirus lockdown, as the country's new prime minister, according to the Elysee Palace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X