వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డుపై వర్షపు నీటిలో సర్పింగ్ చేసిన సౌదీ మహిళ(వీడియో)

By Narsimha
|
Google Oneindia TeluguNews

జెడ్డా: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు సౌదీ అరేబియాలోని జెడ్డా న‌గ‌రం వ‌ర‌ద నీటితో నిండిపోయింది. వ‌ర్షాలు త‌గ్గిన‌ప్ప‌టికీ కొన్ని పాంత్రాల్లో వ‌ర‌ద నీరు అలాగే నిలిచిఉంది. ఈ వ‌ర‌ద నీటిలో ఓ ముస్లిం మ‌హిళ‌ స‌ర్ఫింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక కారుకి తాడు క‌ట్టి, దాని స‌హాయంతో బుర్ఖా వేసుకున్న మ‌హిళ స‌ర్ఫింగ్ చేస్తోంది.

ఈ వీడియోను జోయెస్ క‌రామ్ అనే ఓ రిపోర్ట‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేప‌టికే వీడియో వైర‌ల్‌గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోను ఆద‌ర్శంగా తీసుకుని సౌదీలోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు కూడా ఈ త‌ర‌హా వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు.

భారీ వర్షం కురవడంతో ఈ ప్రాంతంలో వర్షం నీరు ఇంకా అలానే ఉంది. వర్షపు నీళ్ళలో వింత వింత ఆటలు ఆడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. భారీ వర్షాలు కురవడం అరుదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Heavy rains have submerged the streets, roads and many underpasses in Saudi Arabia's Jeddah city, but the disaster has not affected the spirit of citizens of the kingdom. A video has surfaced online that shows a woman in a niqab making the best out of the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X