మళ్ళీ ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి అమెజాన్ సిఈవో .. ఎలన్ మస్క్ ను వెనక్కు నెట్టిన జెఫ్ బెజోస్
ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ తన తొలిస్థానాన్ని దక్కించుకున్నారు . దాదాపు ఆరు వారాల పాటు నిరాటంకంగా ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగిన టెస్లా సిఈవో ఎలన్ మస్క్ సంపద తగ్గడంతో బెజోస్ మళ్లీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నారు.

ఆరు వారాలుగా మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్.. వెనక్కు నెట్టిన జెఫ్ బెజోస్
టెస్లా బాస్ ఎలన్ మస్క్‌ను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచికలో రెండవ స్థానానికి నెట్టివేసి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి పేరును జెఫ్ బెజోస్ తిరిగి పొందాడు. మూడేళ్లపాటు ఇదే పొజీషన్ లో కొనసాగిన బెజోస్ , గత ఆరు వారాలుగా మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ను మొదటి స్థానం నుండి క్రిందికి నెట్టేశారు .
టెస్లా షేర్లు మంగళవారం 2.4% పడిపోయి, దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను 4.6 బిలియన్ డాలర్లకు సంపదను తగ్గించి , ఇండెక్స్‌లో రెండవ స్థానానికి నెట్టాయి. దీంతో జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన మస్క్ ఆ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది.

అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ కు ,మస్క్ కంటే 955 మిలియన్ డాలర్లు ఎక్కువ సంపద
191.2 బిలియన్ డాలర్ల సంపదతో, అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ ,మస్క్ కంటే 955 మిలియన్ డాలర్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు . టెస్లా స్టాక్స్‌లో నిరంతర ర్యాలీ కారణంగా జనవరి 2021 లో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ఆరు వారాల తర్వాత రెండవ స్థానానికి నెట్టివేయ బడ్డారు. అమెజాన్ మరియు టెస్లా యొక్క స్టాక్ ధరలలో ఒడిదుడుకుల కారణంగా, బెజోస్ ఇప్పుడు మస్క్ కంటే 995 మిలియన్ డాలర్లు ధనవంతుడు.

2017 నుండి మూడేళ్ళ పాటు తిరుగే లేని అపర ధనవంతుడు బెజోస్
2017 సంవత్సరం నుండి మూడేళ్లపాటు బెజోస్ కుబేరుల జాబితాలో తన ఆధిక్యాన్ని కనబర్చారు. తొలి స్థానంలోనే కొనసాగారు. బెజోస్ 1995 లో ఆన్‌లైన్ పుస్తక దుకాణంగా ప్రారంభించిన సంస్థను 71.7 ట్రిలియన్ గ్లోబల్ ఇ-కామర్స్ సంస్థగా మార్చాడు. అమెజాన్ కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ కంపెనీ షేర్ల విలువ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీ లో అతి పెద్ద వాటా దారు అయిన బెజోస్ సంపద కూడా పెరుగుతూ వచ్చింది.

అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన .. అయినా ఆయనకే మొదటి స్థానం
అమెజాన్ వ్యవస్థాపకుడికి 2021 సంవత్సరం ఆయనకు చాలా ప్రత్యేకమైందని చెప్పొచ్చు . సిఈవో పదవి నుండి వైదొలగాలని మరియు ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు అధిపతిగా ఉన్న ఆండీ జాస్సీకి ఆ బాధ్యతను అప్పగించాలని బెజోస్ నిర్ణయించారు. అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా కూడా ఆయన తిరిగి అపర కుబేరుల జాబితాలో తొలి స్థానానికి ఎగబాకడం గమనార్హం.