వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఫ్ బెజోస్‌ను మోసం చేసింది ప్రియురాలే... విచారణలో మైండ్ బ్లాక్ అంశాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం నడుస్తుండగానే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి కారణం బెజోస్ మరో మహిళతో నడుపుతున్న ప్రేమవ్యవహారమే కారణం అని ప్రపంచానికి ఇంతకు ముందే తెలిసింది. జెఫ్ బెజోస్ మరో మహిళతో ప్రేమలో ఉన్న విషయం ఓ అంతర్జాతీయ పత్రికకు సమాచారం ఎలా వెళ్లిందనేదానిపైనే ఆరా తీయడం జరిగింది. ఇక్కడే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చాటింగ్‌ను సోదరుడుతో పంచుకున్న బెజోస్ ప్రియురాలు

చాటింగ్‌ను సోదరుడుతో పంచుకున్న బెజోస్ ప్రియురాలు

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీతో గతేడాది విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకులకు దారి తీసింది మాత్రం ఆయన ప్రేమ వ్యవహారమే. బెజోస్ ప్రేమిస్తున్న మహిళ లారెన్ శాంచెస్ అతనితో ఉన్న సంబంధం గురించి తన సోదరుడు మైఖేల్ శాంచెస్‌గు చెప్పింది. అంతేకాదు వీరిద్దరూ డీప్‌ లవ్‌లో ఉన్న సందర్భంలో చేసిన చాటింగ్‌ వివరాలను కూడా తన సోదరుడికి పంపింది. ఇదే అదనుగా తీసుకున్న మైఖేల్ నేషనల్ ఎంక్వైరర్ అనే ఓ అంతర్జాతీయ పత్రికకు డబ్బుల కోసం అమ్ముకున్నట్లు సమాచారం. భారీగా ఆ పత్రిక డబ్బులు ముట్టజెప్పడంతో వారి చాటింగ్ వివరాలను ఆ పత్రికకు ఇచ్చాడు.

బెజోస్‌ను బ్లాక్ మెయిల్ చేశారా..?

బెజోస్‌ను బ్లాక్ మెయిల్ చేశారా..?

జెఫ్ బెజోస్ మరియు లారెన్ శాంచెస్‌ల మధ్య జరిగిన సంభాషణలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ సమీక్షించింది. అయితే బెజోస్‌ను బ్లాక్ మెయిల్ చేసే దిశగా నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రయత్నాలు ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. ఇక బెజోస్ ఫోన్ హ్యాకింగ్ పై కూడా అమెరికా అటార్నీ కార్యాలయం విచారణ చేస్తోంది. 2018 మే 10వ తేదీన బెజోస్ మరియు లారెన్‌ల మధ్య జరిగిన సంభాషణలను గతేడాది జనవరిలో ఎంక్వైరర్ పత్రిక బయటపెట్టింది.

జెఫ్ బెజోస్ అర్థనగ్న ఫోటోను పంపిన ప్రియురాలు

జెఫ్ బెజోస్ అర్థనగ్న ఫోటోను పంపిన ప్రియురాలు

ఆ సమయంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ వారి వ్యక్తిగత సంభాషణలను బయటపెట్టింది. ఇక 2018 జూలై 3వ తేదీన లారెన్ తన సోదరుడు మైఖేల్‌కు ఓ ఫోటోను పంపింది. అందులో జెఫ్ బెజోస్ ఒంటిపై చొక్కా లేకుండా అర్థనగ్నంగా ఉన్నాడు. ఇది కూడా ఎంక్వైరర్ ప్రచురించింది. 2019 ఫిబ్రవరిలో జెఫ్ బెజోస్ ఈ విషయంపై స్పందిస్తూ ఎంక్వైరర్ పత్రిక తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని చెప్పారు. తను లారెన్‌తో వ్యక్తిగతంగా ఉన్నసమయంలో ఫోటోలను బహిర్గతం చేస్తామంటూ ఆ పత్రిక తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చెప్పిన జెఫ్ బెజోస్ ఇది రాజకీయ కోణంలో చూడొద్దని కూడా స్పష్టం చేశారు.

Recommended Video

Jeff Bezos hack : Saudi Crown Prince Hacked Jeff Bezos's Phone || Oneindia Telugu
భారత పర్యటనలో ఉండగా వెలుగులోకి..

భారత పర్యటనలో ఉండగా వెలుగులోకి..

జెఫ్ బెజోస్ తన ప్రియురాలైన లారెన్ శాంచెస్‌తో భారత పర్యటనలో ఉండగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. తాజ్‌మహల్ దగ్గర ఈ జంట తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. అమెజాన్ ఆపరేషన్స్‌ ఇతర పారిశ్రామికవేత్తలను కలిసేందుకు జనవరి 14 నుంచి మూడురోజుల పాటు భారత్‌లో జెఫ్ బెజోస్ పర్యటించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి తన భారత పర్యటనను ప్రారంభించారు జెఫ్ బెజోస్.

English summary
The controversy over Amazon CEO Jeff Bezos is turning murkier by the day. Days after The Guardian claimed Bezos’s mobile phone was hacked by Saudi Arabian prince in 2018, a new report, this time by Wall Street Journal, has revealed that it was, in fact, the multi-millionaire’s girlfriend who played a role in their personal chats becoming public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X