• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

""ఆమె" జాన్.. జెఫ్ బెజోస్ జీవితంలో ఎన్నో మలుపులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

|

న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితం గురించి జెఫ్ బెజోస్ అమెరికా కాంగ్రెస్‌లో చెప్పుకొచ్చారు. అంతేకాదు తన సంస్థను ఈరోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడో కూడా వివరించారు.

 వ్యక్తిగత జీవితం ఆవిష్కరించిన జెఫ్ బెజోస్

వ్యక్తిగత జీవితం ఆవిష్కరించిన జెఫ్ బెజోస్

అమెజాన్ సంస్థ ఈ రోజు ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలిచిందంటే అందుకు తాను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు అధినేత జెఫ్ బెజోస్. పలు ఆసక్తికరమైన విషయాలను జెఫ్ బెజోస్ అమెరికా కాంగ్రెస్‌లో పంచుకున్నారు. 26 ఏళ్ల క్రితం అమెజాన్ సంస్థను స్థాపించినట్లు చెప్పిన జెఫ్ బెజోస్... కస్టమర్‌కు అతి చేరువలో తీసుకొచ్చామని చెప్పారు. "నా తల్లికి 17 ఏళ్లున్న సమయంలో నేను పుట్టాను. ఆ సమయంలో మా అమ్మ న్యూమెక్సికోలోని అల్‌బుకర్క్‌లో హైస్కూలు విద్యను అభ్యసిస్తుండేది. 1964వ సంవత్సరంలో 17 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి గర్భం దాల్చడం అంటే ఆ నగరంలో పలు విధాలుగా చెవులుకొరుక్కునే వారు. ఎన్నో అవమానాలను ఆమె ఎదుర్కొంది" అని జెఫ్ బెజోస్ చెప్పారు.

 గర్భం దాల్చిందని నా తల్లిని స్కూలుకు అనుమతించలేదు

గర్భం దాల్చిందని నా తల్లిని స్కూలుకు అనుమతించలేదు

గర్భం దాల్చిన యువతి స్కూలుకు వస్తుండటాన్ని తప్పుబట్టిన ఆ స్కూలు యాజమాన్యం తన తల్లిని బయటకు పంపగా ఆమె కోసం తన తాత వచ్చి మాట్లాడారనే విషయాన్ని చెప్పారు జెఫ్ బెజోస్. కొన్ని చర్చల తర్వాత తన తల్లిని తిరిగి స్కూలులో చేరేందుకు ప్రిన్సిపాల్ అనుమతించారని వెల్లడించారు. అయితే చదువు తప్ప ఆమె మిగతా ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనరాదని... అంతేకాదు ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన లాకరు కూడా ఇవ్వడం జరగదని ఆ ప్రిన్సిపాల్ చెప్పారని వెల్లడించారు. ఇందుకు తన తాత కూడా ఒప్పుకున్నారని వెల్లడించారు. ఇక గర్భంతోనే తన తల్లి తన హైస్కూలు విద్యను పూర్తి చేసిందని గద్గద స్వరంతో చెప్పారు బెజోస్. అయితే ఎట్టి పరిస్థితుల్లో తన విద్యను పూర్తి చేయాలన్న కసి ఉండటంతో ఆమె రాత్రి వేళల్లో జరిగే స్కూలులో ఎన్‌రోల్ చేసుకుందని చెప్పారు. అంతేకాదు అప్పుడే పుట్టిన తనను క్లాస్‌రూంకు తీసుకొచ్చేందుకు తన తల్లికి అనుమతిచ్చారంటూ జెఫ్ బెజోస్ చెప్పారు.

 నా తండ్రి క్యూబా నుంచి అమెరికాకు వలస వచ్చాడు

నా తండ్రి క్యూబా నుంచి అమెరికాకు వలస వచ్చాడు

ఇక తన తల్లి ఎప్పుడూ రెండు డఫుల్ బ్యాగులతో కనిపించేందని చెప్పిన బెజోస్... ఒక బ్యాగులో పుస్తకాలు రెండో బ్యాగులో డయాపర్లు, బాటిల్స్ ఇతరత్రా వస్తువులు తీసుకొచ్చుకునేదని చెప్పారు. తన తండ్రి పేరు మిగేల్ అని నాలుగేళ్ల వయసులో తాను ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ బెజోస్.క్యూబా నుంచి అమెరికాకు 16 ఏళ్ల వయసులో తన తండ్రి వలస వచ్చాడని చెప్పారు బెజోస్. ఆ రోజుల్లో తన తండ్రికి వాళ్ల తల్లిదండ్రులు అమెరికాలో వాతావరణం చాలా చల్లగా ఉంటుందని చెప్పి ఓ జాకెట్ కుట్టించారని అది ఇప్పటికీ తన వద్ద ఉందని చెప్పారు జెఫ్ బెజోస్. ముందుగా తన తండ్రి ఫ్లోరిడాలోని ఓ శరణార్థుల కేంద్రంలో ఉన్నారని ఆ తర్వాత డెలావేర్‌కు వెళ్లారని చెప్పారు. ఇక తన తండ్రి ఎలాగోలాగా అల్‌బుక్‌రిక్‌లోని కాలేజీలో అడ్మిషన్ పొందాడని చెప్పిన బెజోస్ అక్కడే తన తల్లిని కలిసినట్లు వెల్లడించారు. జీవితంలో ఎన్నో అద్భుతమైన బహుమతులు వస్తుంటాయని చెప్పిన బెజోస్ తనకు మాత్రం తన తల్లిదండ్రులే మంచి కానుక అని చెప్పారు. తనతో పాటు సోదరీసోదరులకు తమ తల్లిదండ్రులు రోల్‌మోడల్‌గా నిలిచారని చెప్పారు.

 అమెజాన్‌లో తొలి ఇన్వెస్టర్స్ నా తల్లిదండ్రులు

అమెజాన్‌లో తొలి ఇన్వెస్టర్స్ నా తల్లిదండ్రులు

1994లో అమెజాన్ కాన్సెప్ట్ ప్రారంభమైందని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ఒక బుక్‌స్టోర్‌ను స్థాపించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆసమయంలో న్యూయార్క్ నగరంలో ఓ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో పనిచేసేవాడినని వెల్లడించారు. అయితే అమెజాన్ సంస్థలో పెట్టుబడులు ముందుగా తమ తల్లిదండ్రుల నుంచే వచ్చిందని గుర్తు చేసుకున్నారు బెజోస్. జీవితాంతం వారు కష్టపడి దాచుకున్న డబ్బులను ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారని అసలు ఆ కాన్సెప్ట్ వారికి అర్థం కాలేదని చెప్పారు. కేవలం తనపై నమ్మకం ఉంచి మాత్రమే పెట్టుబడి పెట్టారని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టినప్పటికీ ఇందులో విజయం సాధిస్తామా లేదా అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేనని చెప్పినప్పటికీ పోతే పోయిందిలే అని చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.

  JioMart Set To Become Largest E-grocer | Oneindia Telugu
   మిలియన్ డాలర్లు సేకరించేందుకు ఎన్ని కష్టాలో..?

  మిలియన్ డాలర్లు సేకరించేందుకు ఎన్ని కష్టాలో..?

  ఇక చివరిగా ఒక మిలియన్ డాలర్లు సేకరించేందుకు దాదాపుగా 50 సమావేశాలు నిర్వహించినట్లు చెప్పిన జెఫ్ బెజోస్... ఆ సమయంలో అందరూ తనను ప్రశ్నించింది మాత్రం ఇంటర్నెట్ అంటే ఏమిటి అని చెప్పారు. తొలినాళ్లలో సంస్థ ఎదుర్కొన్న కష్టాలను సైతం బెజోస్ అమెరికా కాంగ్రెస్‌లో చెప్పారు. ఎవరూ ఊహించలేని సక్సెస్‌ను అమెజాన్ ఈరోజు సాధించిందని బెజోస్ గర్వంగా చెప్పారు. అయితే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా రిస్క్ తీసుకోవడమే అని తనకు తెలుసని వెల్లడించారు. ఇక సంస్థను స్థాపించినప్పటి నుంచి 2001 వరకు తమకు దాదాపుగా మూడు బిలియన్ డాలర్ల మేరా నష్టం వాటిల్లినట్లు చెప్పిన బెజోస్... ఆ ఏడాది చివరి త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు.

  English summary
  Amazon founder and CEO talks about personal life and narrates the difficulties the company faced in initial years of its existence.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X