వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైషె చీఫ్ మసూద్ అజర్ ఆస్తులు జప్తు: యూరోపియన్ దేశాల జాబితాలో అతని పేరు చేర్చడానికి ఏర్పాట్లు!

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: భయానక ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం ఊహించని దెబ్బ కొట్టింది. జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం.

<strong>ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ</strong>ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసిన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

JeM chief Masood Azhar assets freezed by France government

ఈ ఘటన తరువాత ఫ్రాన్స్ ప్రభుత్వం జైషె సంస్థ కార్యకలాపాలపై నిఘా వేసింది. మసూద్ అజర్ కు తమ దేశంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. వాటన్నింటినీ వెంటనే జప్తు చేయాలని ఆదేశిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ అంతర్గత భద్రత మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.

మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సాధ్యం పడట్లేదు. దీనితో- మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ.. యూరోపియన్ యూనియన్ దేశాల జాబితాలో అతని పేరును చేర్చడానికి చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ ఈ ప్రకటనలో తెలియజేసింది.

JeM chief Masood Azhar assets freezed by France government

మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాది సంస్థగా గుర్తించడానికి చైనా అంగీకరించట్లేదు. దీనితో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా మినహా అన్ని దేశాలూ ఈ విషయంలో భారత్ కు అండగా నిలుస్తున్నాయి. చైనా మాత్రం పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నందు.. ప్రస్తుతం ఆ దేశంలోనే ఉన్న మసూద్ అజర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయడానికి వెనుకంజ వేస్తోంది.

English summary
France has decided to freeze the assets of Jaish-e-Mohammad (JeM) founder and leader Masood Azhar, the French government said on Friday. In a joint statement issued by the French interior ministry, finance ministry and foreign ministry said they will discuss putting Masood Azhar on a European Union list of people suspected of being involved in terrorism. "A deadly attack took place in Pulwama on 14th February 2019, claiming over 40 victims from the Indian police forces. The Jaish-e-Mohammed, which the United Nations has deemed to be a terrorist organization since 2001, has claimed responsibility for this attack, the French statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X