వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ మిలటరీ హాస్పిటల్‌లో భారీ పేలుడు..గాయపడ్డవారిలో జైషే చీఫ్ మసూద్ అజర్?

|
Google Oneindia TeluguNews

రావల్పిండి : పాకిస్థాన్ రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయలయ్యాయని, అందులో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కూడా ఉన్నాడని ావర్తలు వచ్చాయి. దీనికి సంబంధించి రావల్పిండికి చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్‌సాన్ ఉల్లా మియాఖలీ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అజర్ ప్రస్తుతం మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పేలుడు జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో 10 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారందరినీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు అహ్‌సాన్ చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతివ్వలేదని అన్నారు.

JeM chief Masood Azhar injured in military hospital blast

అహ్‌సాన్‌తో పాటు మరికొందరు నెటిజన్లు ఈ ఘటనకు సంబంధించి పోస్ట్ చేసిన వీడియోలను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో జరిగింది ప్రమాదం కాదని, ప్లాన్ ప్రకారం జరిగిన దాడేనని కొందరు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంత వరకు స్పందించలేదు. మిలటరీ హాస్పిటల్‌లో జరిగింది ప్రమాదమా లేక దాడి జరిగిందా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

English summary
JeM chief Masood Azhar was among the 10 people allegedly injured after a blast rocked a military hospital on Sunday, according to Pakistani Twitter users. A human rights activist from Quetta, Ahsan Ullah MiaKhail, has alleged that the army has barred the media from covering the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X