వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదేళ్లు ఆగితే చాలు.. ఎగిరే కారులో వెళ్లొచ్చు ఎంచక్కా

జెట్ ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా మరో ఎగిరే కారును రూపొందిస్తోంది. గతంలో మనుషులు నిలువుగా పైకి ఎగిరేలా చేసే జెట్ ప్యాక్ యంత్రాన్ని సిద్ధం చేసింది కూడా ఈ కంపెనీయే.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇప్పుడంటే కార్లు రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయిగానీ.. వాటికి రెక్కలొచ్చి నిలువునా పైకెగిరి గమ్యం వైపు అవి దూసుకెళ్లేందుకు ఇక ఎక్కువ రోజులు పట్టదేమో. ఎందుకంటే.. ఇప్పటికే కొన్ని ఎగిరే కార్లు మార్కట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి మరి.

జెట్ ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా మరో ఎగిరే కారును రూపొందిస్తోంది. గతంలో మనుషులు నిలువుగా పైకి ఎగిరేలా చేసే జెట్ ప్యాక్ యంత్రాన్ని సిద్ధం చేసింది కూడా ఈ కంపెనీయే.

Jetpack pioneer David Mayman's new electric VTOL flying car project

రోజు రోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని.. ఒకవైపు బ్యాటరీల శక్తి సామర్థ్యాలు పెరిగిపోతుండగా మరోవైపు సెన్సర్లు, ఎలక్ట్రిక్ మోటార్ల ఖరీదేమో తగ్గపోతోంది. అన్నింటినీ మించి ఒకప్పుడు అందుబాటులో లేని సాంకేతిక పరిజ్ఞానం ఇప్పడు సామాన్యుడికి సైతం చేరువైంది.

ఈ నేపథ్యంలో జెట్ ఏవియేషన్స్ సంస్థ ఎగిరే కారు తయారీకి నడుం బిగించింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలుంది.

ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పని చేస్తుంది. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలోనే ఈ ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

English summary
The age of the flying car will soon be upon us. Thanks to a convergence of technology developments – lithium batteries, multirotor drones, electric aircraft, cheap and plentiful inertial sensors – the three-dimensional commuting revolution is beginning, and a number of companies are making serious progress in the embryonic stages of this very exciting space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X