వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా కంటే చైనాలో వాళ్లు పెరిగిపోయారు

|
Google Oneindia TeluguNews

షాంగై: అనేక రంగాల్లో దూసుకు వెలుతున్న చైనా ఇప్పుడు శ్రీమంతుల సంఖ్యలో అమెరికాను వెనక్కి నెట్టేసింది. అమెరికాతో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా నివేదిక తేల్చింది.

ప్రస్తుతం అమెరికాలో 535 మంది బిలియనీర్లు ఉన్నారు. చైనాలో బిలియనీర్ల సంఖ్య 594కు చేరింది. హూరూన్ విడుదల చేసిన వార్షిక ధనవంతుల జాబితాలో ఈ విషయం వెలుగు చూసింది. ఇప్పటి వరకు చైనాలో శ్రీమంతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆలీబాబా వ్యవస్థాపకుడు జాన్ మాను షాక్ తిన్నారు.

జాన్ మాను వెనక్కి నెట్టి ప్రాపర్టీ మేగ్నెట్ వాంగ్ జియాన్ లిన్ అత్యధిక డాలర్ల సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నారు. దలియన్ వండా గ్రూప్ చైర్మన్ అయిన వాంగ్ జియాన్ లిన్ 32.1 బిలియన్ల డాలర్ల సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నారు.

Jianlin defends top spot in China Rich list

జాక్ మా సంపాదన 41 శాతం పెరిగినా 30.6 బిలియన్ డాలర్ల దగ్గర ఆగిపోయింది. బావో నెంగ్ గ్రూప్ చైర్మన్ అయిన యావో ఝెన్హువా గత సంవత్సరం సంపాదనతో పోల్చితే ఏకంగా 820 శాతం పెరిగింది.

బావో నెంగ్ 17.2 బిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానంలో ఉన్నారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ వ్యస్థాపకుడు పోనీ మా, ఝూంగ్ ఖింగౌ, సెర్చ్ ఇంజిన్ బైడు వ్యవస్థాపకుడు రాబిన్ లీ, ఆయన భార్య మెలిస్సా మా తదితరులు హురూన్ జాబితాలో స్థానం సంపాధించుకున్నారు.

అయితే అమెరికాను వెనక్కి నెట్టిన చైనా నుంచి ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల జాబిలో ఏ ఒక్కరూ స్థానం సంపాధించుకోలేకపోయారు. అమెరికాను వెనక్కి నెట్టిన చైనా మాత్రం ప్రపంచ శ్రీమంతుల టాప్ 20 జాబితాలో చేరలేకపోయింది.

English summary
The annual rich list of China's movers and shakers gives a temperature check on where money is flowing in China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X