• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బైడెన్ ఒక అసమర్థుడు,అవినీతిపరుడు... మీడియా,టెక్ కంపెనీలు అతనికి కొమ్ము కాస్తున్నాయి : ట్రంప్

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జో బైడెన్ ఒక విఫలవంతుడని... అవినీతి రాజకీయ నేత అని ఆరోపించారు. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టిన ఈమెయిల్స్,డాక్యుమెంట్స్ బైడెన్ అవినీతిని నిరూపించాయన్నారు. కాబట్టి నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు తననే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లోరిడా,జార్జియా రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  US Election 2020 : Joe Bidenకు ఓటమి తప్పదు.. ఆ చెత్తను ఊడ్చిపారేస్తా! - Donald Trump

  ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్: ఆస్పత్రిలో ఉండగా తెలిసిందంటూ డొనాల్డ్ ట్రంప్

  మీడియా,టెక్ కంపెనీలపై విరుచుకుపడ్డ ట్రంప్

  మీడియా,టెక్ కంపెనీలపై విరుచుకుపడ్డ ట్రంప్

  దేశంలో వామపక్ష నియంత్రణలో ఉన్న మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తూ జో బైడెన్‌కి మద్దతుగా నిలుస్తోందని ట్రంప్ ఆరోపించారు. దిగ్గజ టెక్ కంపెనీలు సైతం బైడెన్‌ వైపే నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఓ అసమర్థుడి చేతిలో తాను ఓటమిపాలవుతానని ఊహించట్లేదన్నారు. 'జో బైడెన్ ఫ్యామిలీ ఒక క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్.. అది మీకు కూడా తెలుసు. కానీ మీడియా,టెక్ కంపెనీలు వీటిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు..' అని పేర్కొన్నారు.

  టెక్ కంపెనీలకు హెచ్చరిక...

  టెక్ కంపెనీలకు హెచ్చరిక...

  'ట్రంప్ రీఎలక్షన్' ట్విట్టర్ హ్యాండిల్ తాత్కాలికంగా బ్లాక్ అవడంపై కూడా ట్రంప్ మండిపడ్డారు. చూస్తూనే ఉండండి... అన్నింటికీ నవంబర్ 3న సమాధానం చెప్పబోతున్నాం... మేము చేయబోయే అతిపెద్ద పని అదే. మేము కేవలం జో బైడెన్‌ని మాత్రమే కాదు.. వామపక్ష మీడియాను,బిగ్ టెక్ కంపెనీలను ఎదుర్కొంటున్నాం. గత అధ్యక్ష ఎన్నికల్లోనూ వాళ్లు చాలా శక్తివంతులమని భావించారు. అయినా నేనే గెలిచాను.' అని పేర్కొన్నారు. అంతేకాదు సెక్షన్ 320 కింద టెక్ కంపెనీలకు కల్పించిన భద్రతను తొలగిస్తామని హెచ్చరించారు.

  తామే గెలుస్తామన్న ధీమా...

  తామే గెలుస్తామన్న ధీమా...

  అమెరికా ఎన్నికల్లో ఈసారి జో బైడెన్‌కు భారీ ఓటమి తప్పదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయంతో వాషింగ్టన్‌లో పేరుకుపోయిన చెత్తను ఊడ్చిపారేస్తామని మీడియాను,టెక్ కంపెనీలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల క్యాంపెయిన్స్‌లో తనకు 'రెడ్ వేవ్' స్పష్టంగా కనిపిస్తోందని... మరోసారి వైట్ హౌస్‌లో పాగా వేసేది తామేనని అన్నారు.మరోవైపు గతవారం రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రెండ్స్ ప్రకారం... ట్రంప్ కంటే బైడెన్ రెట్టింపు నంబర్లతో ముందుండటం గమనార్హం. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పదేపదే ఎన్నికల క్యాంపెయిన్స్‌లో ఆరోపిస్తున్నారు.

  English summary
  US President Donald Trump attacked his Democratic challenger Joe Biden saying he is a "disaster" and a "corrupt" politician, and urged his supporters in Florida and Georgia to give him a thumping victory in the November 3 presidential elections. He also alleged that left-controlled media and big tech companies are siding with Biden in this poll campaign
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X