వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Inauguration Day 2021: నేడే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే

|
Google Oneindia TeluguNews

'ఇనాగరేషన్ డే'గా పిలుచుకునే అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(జనవరి 20న) నాడు ప్రమాణం చేయనున్నారు. అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా అదే రోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Recommended Video

#TOPNEWS : AP CM YS Jagan meets Union minister Amit shah | Joe Biden Inauguration | Corona Update

ఇన్‌సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? -త్వరలో పెద్ద తలలు: సజ్జల అనూహ్య వ్యాఖ్యలుఇన్‌సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? -త్వరలో పెద్ద తలలు: సజ్జల అనూహ్య వ్యాఖ్యలు

క్యాపిటల్ కట్టుదిట్టం..

క్యాపిటల్ కట్టుదిట్టం..

ఎన్నికల ఫలితాలు ఫేక్ అంటూ, ఇప్పటికీ వాటిని విశ్వసించని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి.. అమెరికా ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి క్యాపిటల్ భవనంపై దాడికి దిగిన దరిమిలా.. అదే చోట ఇప్పుడు జోబైడెన్, కమలల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవంతిలో, చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. నిరసనకారులకు చిన్న అవకాశం కూడా లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. కాగా..

ముందుగా జిల్ బైడెన్ ప్రసంగం..

ముందుగా జిల్ బైడెన్ ప్రసంగం..

ఇనాగరేషన్ డే-2021 కార్యక్రమానికి ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20న(బుధవారం) రాత్రి 10.00 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత అమెరికా జాతీయగీతాన్ని ఆలపిస్తారు. యూఎస్ కొత్త ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(జోబైడెన్ భార్య) ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత..

బైడెన్, కమలతో ప్రమాణాలు ఇలా..

బైడెన్, కమలతో ప్రమాణాలు ఇలా..

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి ముందు కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తర్వాత శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేయడాన్ని సూచించడానికి బైడెన్, కమలా హ్యారిస్ పాస్ ఇన్ రివ్యూ తనిఖీని పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమానికి దిగిపోతోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఊస్టింగ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పేన్స్, రిపబ్లికన్ ముఖ్యులు మాత్రం రేపు కేపిటల్ భవంతికి వస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే..

 కమల వికాసాన్ని లైవ్‌లో చూడండిలా..

కమల వికాసాన్ని లైవ్‌లో చూడండిలా..

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమెతోపాటు ప్రెసిడెంట్ గా బైడెన్ ప్రమాణస్వీకారాలను అమెరికాలోని అన్ని ప్రధాన టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. సీఎన్ఎన్, ఎంఎస్ఎన్బీసీ, ఏబీసీ, సీబీఎస్, పీబీఎస్, ఎన్బీసీ లాంటి ఛానెళ్లతోపాటు ఈ కార్యక్రమాన్ని లైవ్లో అమేజాన్ ప్రైమ్ వీడియో, మైక్రోసాఫ్ట్ బింగ్, ఫాక్స్ నుంచి న్యూస్ నౌ (SD / HD లో ఛానల్ 212/1212) ఇంకా AT&T DIRECTV (ఛానల్ 201) వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా చూడవచ్చు. అంతేకాకుండా బైడెన్ ఇనాగరల్ కమిటీ సోషల్ మీడియా ఛానెళ్లతో పాటు కూడా bideninaugural.org/watch/ లో కూడా అందుబాటులో ఉంటుంది.

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

English summary
The United State of America will soon have a new President and Vice President. Joe Biden will be sworn in as the 46th President of the USA, while Indian-origin politician Kamala Harris will take oath as the 49th Vice President on Wednesday. Kamala will also become the first woman Vice President of the USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X