వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్‌ మ్యాగజైన్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2020గా బైడెన్-కమలా హ్యారిస్‌- సంయుక్తంగా ఎంపిక

|
Google Oneindia TeluguNews

అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పేరుతో ఆ ఏడాదిలో అత్యంత ప్రభావశీలుర జాబితా ప్రకటిస్తుంటుంది. ఇందులో 2020కు గానూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన జో బైడెన్‌- కమలా హ్యారిస్‌ ద్వయం సంయుక్తంగా ఎంపికయ్యారు. దీంతో బైడెన్‌-కమలా ద్వయానికి మరో విజయం దక్కినట్లయింది.

Recommended Video

Joe Biden And Kamala Harris Named Time Person Of The Year

డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా పోటీపడిన జో బైడెన్, కమలా హ్యారిస్‌ అసలు గట్టిపోటీ ఇస్తారా అన్న పరిస్ధితి నుంచి ఏకంగా రిపబ్లికన్లపై సంచలన విజయం సాధించడం వరకూ ఓ చరిత్రగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరు సాధించిన అద్భుత విజయంపై అమెరికాతో పాటు పలు దేశాల మీడియా, ఇతర ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ ఏడాది తమ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కోసం సంయుక్తంగా బైడెన్‌-కమల ద్వయాన్ని ఎంపిక చేసింది.

Joe Biden and Kamala Harris named Time Person of the Year

టైమ్‌ మ్యాగజైన్ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రేసులో వీరితో పాటు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్ద డైరెక్టర్‌ ఆంటోనీ ఫౌసీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు హెల్త్‌ కేర్‌ వర్కర్లు కూడా పోటీపడ్డారు. అయితే కరోనాపై పోరాడిన హెల్త్‌ వర్కర్లు, అమెరికన్లను సకాలంలో అప్రమత్తం చేసి మరణాలను నివారించిన ఆంటోనీ ఫౌసీ కంటే కూడా భవిష్యత్తులో తమ నిర్ణయాలతో కరోనాపై పోరాడగలమన్న నమ్మకాన్ని కల్పించిన బైడెన్‌-కమలా హ్యారిస్‌ ద్వయాన్నే తమ ఛాయిస్‌గా టైమ్‌ మ్యాగజైన్‌ కమిటీ ఎంపిక చేసింది.

English summary
US president elect Joe Biden and his deputy Kamala Harris have been choosen as Time Magazine's 2020 "person of the year".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X