వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్, కమలా హారిస్‌ల సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లు ఇవే: పటిష్ట రహస్య భద్రత కోసమే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల భద్రతా ఏర్పాట్లు ఎంతో పటిష్టంగా ఉంటాయి. ఆకస్మాత్తుగా ఏర్పడే ప్రమాదాల నుంచి కూడా కాపాడేందుకు ఎల్లవేళలా రక్షణ దళాలు కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. సాధారణ భద్రతతోపాటు రహస్య భద్రత కూడా ఎక్కువగానే ఉంటుంది.

Recommended Video

#TopNews : #JoeBiden Takes Oath As 46th President Of The United States | Oneindia Telugu

అధ్యక్షుడికి, ఆయన కుటుంబానికి, అధ్యక్షుడితో కలిసి పనిచేసే ముఖ్యమైన వ్యక్తులకు ప్రభుత్వం రహస్య భద్రత కల్పిస్తుంది. అయితే, భద్రతా దళాలు వారిని అసలు పేర్లకు బదులు సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లతో పిలుస్తుంటాయి. ఎంతో కాలంగా ఈ సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లు అమల్లో ఉన్నాయి.

 Joe Biden and Kamala Harriss secret code names revealed

అమెరికా అధ్యక్షుడి ప్రమాణం చేసిన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కమలా హారిస్‌లకు ఈ సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లను కేటాయించారు. జో బైడెన్‌ను 'సెల్టిక్' అని, కమలా హారిస్‌ను 'పయోనీర్' అని పిలువనున్నారు.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్.. బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన సెల్టిన్ పేరును, తన సతీమణి జిల్ బైడెన్‌కు కేటాయించిన కాప్రి పేరును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతున్నారు. ఇక కమలా హారిస్.. వైట్ హౌస్ అధికారులు సూచించిన సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లలో ఉన్న 'పయోనీర్'ను గత కొన్ని నెలల క్రితమే ఎంచుకోవడం గమనార్హం. ఇప్పుడు ఆ పేరునే ఖరారు చేశారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో ఆయనను రహస్య భద్రతా దళాలు రెనెగేడ్ అని, ఆయన సతీమణి మిచెల్ ఒబామాను రెనీసన్స్ అని పిలిచాయి. ఆ తర్వాత అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌ను మొగుల్ అని, ఆయన సతీమణి మెలినియా ట్రంప్‌ను మ్యూన్ అని, కుమార్తె ఇవాంకను మార్వెల్ అని, కుమారుడు ట్రంప్ జూనియర్‌ను మౌంటనీర్ అని, ఎరిక్ ట్రంప్‌ను మార్స్‌మన్, అల్లుడు కుష్నర్‌ను మెకానిక్ అని పిలిచేవారు.

English summary
Joe Biden and Kamala Harris's secret code names revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X