వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌కు డెడ్‌లైన్ బిగిన్: జో బిడెన్.. ఫస్ట్ స్కెచ్: వైట్‌హౌస్‌లో ప్రైవేట్ సిటిజన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్..ఇక వైట్‌హౌస్‌లో చేరడానికి సన్నాహాలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం నుంచే దీనికి సంబంధించిన కసరత్తును ఆరంభించారు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. 73 రోజుల్లో అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌లో ఆయన అడుగు పెట్టబోతున్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఫలితాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం, వైట్‌హౌస్‌ను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. ఓట్ల లెక్కింపుపై న్యాయపరంగా పోరాడటానికి ఆయన పావులు కదుపుతున్నారు.

జో బిడెన్‌తో దేశీ కనెక్షన్: ముంబై, చెన్నైతో లింక్: ఇంటిపేరుతో మిస్టరీ లెటర్జో బిడెన్‌తో దేశీ కనెక్షన్: ముంబై, చెన్నైతో లింక్: ఇంటిపేరుతో మిస్టరీ లెటర్

డొనాల్డ్ ట్రంప్ వాదన ఎలా ఉన్నప్పటికీ.. వైట్‌హౌస్‌ను ఖాళీ చేయించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బిడెన్ ఎప్పుడు బాధ్యతలను స్వీకరిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నార్త్ కరోలినా, జార్జియా, అలస్కాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా ముగియాల్సి ఉంది. నార్త్ కరోలినాలో డొనాల్డ్ ట్రంప్, జార్జియాలో జో బిడెన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

Joe Biden Begins Moving into White House in 73 days from Sunday

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లు జో బిడెన్‌కు రావడంతో ఆయనను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు అధికారులు. నార్త్ కరోలినా, జార్జియా, అలస్కాలను డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నప్పటికీ.. 270 ఓట్లను అందుకోలేరు. బిడెన్, ట్రంప్ మధ్య ఉన్న ఎలక్టోరల్ ఓట్ల ఆధిక్యత తగ్గుతుందంతే. పెన్సిల్వేనియా, మిచిగాన్, అరిజోనా, మిన్నెసోటాల్లో తొలుత డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలో నిలిచినప్పటికీ.. అనంతరం వెనుకబడ్డారు. అనూహ్యంగా జో బిడెన్ విజయం సాధించారు. దీన్ని తప్పు పడుతున్నారు ట్రంప్. బ్యాలెట్ల లెక్కింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు.

Recommended Video

US Election 2020: A victory for “we the people” - Joe Biden | Oneindia Telugu

తాను 73 రోజుల్లో వైట్‌హౌస్‌తో చేరబోతున్నానంటూ జో బిడెన్ తాజాగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమితో డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ వ్యక్తిగా మారిపోయారని, ఆయన ఇక వైట్‌హౌస్‌లో నివసించే అధికారాన్ని, హక్కును కోల్పోయారని చెప్పారు. ఆయన మాజీ పబ్లిక్ సర్వెంట్ కిందికే లెక్క అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఎంతోకాలం పాటు వైట్‌హౌస్‌లో కొనసాగలేరని చెప్పారు. అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయక తప్పదనే సంకేతాలను పంపించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో క్యాథలిక్.. బిడెన్. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి నేత జాన్ ఎఫ్ కెన్నడి.

English summary
US President-elect Joe Biden took the first steps Sunday towards moving into the White House in 73 days, as Donald Trump again refused to admit defeat and tried to sow doubt about the election results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X