వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్ దెబ్బకు రికార్డులు బద్దలు... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టించిన డెమోక్రాట్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కొత్త చరిత్ర సృష్టించారు. మునుపటి రికార్డులను బద్దలు కొడుతూ... అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం 70.7మిలియన్ల ఓట్లు బైడెన్ ఖాతాలో పడ్డాయి. గతంలో ఏ అమెరికా అధ్యక్ష అభ్యర్థికి ఇంత భారీ స్థాయిలో ఓట్లు రాలేదు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న దశలోనే జో బైడెన్ ఈ రికార్డును నెలకొల్పడం విశేషం. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే... బైడెన్ ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జో బైడెన్ విజయం దాదాపుగా ఖరారవడం.. కొత్త రికార్డులను సృష్టించడంతో డెమెక్రాటిక్ పార్టీలో ఆనందోత్సాహం నెలకొంది.

Recommended Video

World #TSUNAMI Awareness Day 2020: ఇండోనేషియా సునామీ 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం...!!

 అమెరికా : ఈ రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతోన్న కౌంటింగ్... ఇప్పటివరకూ ఎన్ని ఓట్లు లెక్కించారంటే... అమెరికా : ఈ రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతోన్న కౌంటింగ్... ఇప్పటివరకూ ఎన్ని ఓట్లు లెక్కించారంటే...

ఒబామా రికార్డు బ్రేక్...

ఒబామా రికార్డు బ్రేక్...

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే జో బైడెన్ అత్యధిక ఓట్లు గెలుచుకున్న అభ్యర్థి అని నేషనల్ పబ్లిక్ రేడియో(NPR) వెల్లడించింది. ఇప్పటివరకూ లెక్కింపు పూర్తయిన మొత్తం ఓట్లలో 50.19శాతం ఓట్లు బైడెన్‌ ఖాతాలోనే పడినట్లు తెలిపింది. 2008లో అప్పటి డెమోక్రాటిక్ అభ్యర్థి బరాక్ ఒబామా అత్యధికంగా 69 మిలియన్ల ఓట్లు గెలుచుకోగా... ఆ రికార్డును బైడెన్ బద్దలు కొట్టారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు,రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే బైడెన్ 2.7మిలియన్ల ఎక్కువ ఓట్లు గెలుచుకున్నారు.

అధ్యక్ష పీఠానికి ఆరు ఓట్ల దూరంలో...

అధ్యక్ష పీఠానికి ఆరు ఓట్ల దూరంలో...

పలు కీలక రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బైడెన్ పాపులర్ ఓట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ కేవలం 74శాతం ఓట్లను మాత్రమే లెక్కించారు. అత్యధికంగా 50 ఎలక్టోరల్ సీట్లున్న కాలిఫోర్నియాలో బైడెన్ 65.3శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 32.9శాతం ఓట్లతో చాలా వెనుకబడ్డారు. దీంతో అక్కడి 55 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరడం లాంఛనమే. మిచిగాన్,విస్కాన్సియా వంటి కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ను వెనక్కి నెట్టిన బైడెన్... మొత్తంగా 264 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. అధ్యక్ష పదవికి ఆయన కేవలం ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు.

పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందంజ...

పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందంజ...

ప్రస్తుతం ట్రంప్ పెన్సిల్వేనియాలో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ 7 లక్షల పైచిలుకు ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. వీటిల్లో దాదాపు 59-61శాతం ఓట్లు గెలుచుకుంటేనే బైడెన్ ఇక్కడ నెగ్గగలరు. అయితే ఇప్పటికే పలు కీలక రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉండటంతో పెన్సిల్వేనియాతో సంబంధం లేకుండా అధ్యక్ష రేసులో ఆయన దూసుకెళ్తున్నారు. మరోవైపు జార్జియా,నెవాడా ఫలితాలపై ట్రంప్ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జార్జియాలో ట్రంప్ ఓడిపోతే రీకౌంటింగ్ నిర్వహించాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు.

English summary
In 2008, Barack Obama earned 69,498,516 votes in the presidential election, the most ever. Now, Mr. Obama's former vice president, Democratic nominee Joe Biden, has surpassed that tally, with a record 70,470,207 votes (50.3 percent), and counting, in the 2020 election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X