• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Rashad Hussain: బైడెన్ అనూహ్యం -మత స్వేచ్ఛ అంబాసిడర్‌ భారతీయ అమెరికన్ -తొలి ముస్లిం కూడా

|

అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏలుబడికి పూర్తి భిన్నంగా, వలసదారులకు, ఇతర మతస్తులకు అధిక ప్రధాన్యం కల్పిస్తూ అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తన టీమ్ లో కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లను నియమించుకున్న ఆయన.. తాజాగా అంతర్జాతీయ స్థాయి ప్రచారానికి కూడా ఇండియన్ అమెరికన్ నే ఎంచుకున్నారు.

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

భారతీయ అమెరికన్‌ రషద్‌ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేషన్‌ చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్‌ నిలిచారు. రషద్‌ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్. ఆయన గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నేషనల్ సెక్యూరిటీ డివిజన్‌లో సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారని వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొంది.

Joe Biden nominates Indian-American Rashad Hussain as first Muslim religious freedom ambassador

గతంలో బరాక్ ఒబామా హయాంలో స్ట్రాటజిక్ కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్, డిప్యూటీ అసోసియేట్ వైట్ హౌస్ కౌన్సిల్ కోసం ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) కు అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా రషద్ సేవలందించారు. రాయబారిగా.. హుస్సేన్ విద్య, వ్యవస్థాపకత, ఆరోగ్యం, అంతర్జాతీయ భద్రత, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇస్లామిక్ సహకారం (OIC), ఐక్యరాజ్యసమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు.

కృష్ణమ్మ పరవళ్లు: ప్రాజెక్టులన్నీ ఫుల్లు -జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత -ప్రకాశం బ్యారేజీకృష్ణమ్మ పరవళ్లు: ప్రాజెక్టులన్నీ ఫుల్లు -జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత -ప్రకాశం బ్యారేజీ

  Ind Vs SL : Teamindia Captain Shikhar Dhawan Lectures to Srilanka Cricketers

  ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్‌ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా-బైడెన్ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్ యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని పొందారు. రషద్‌ నియామకంపై అమెరికన్‌ యూదు కమిటీ (AJC) యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా నియమించినందుకు జో బైడెన్‌ పరిపాలనను ప్రశంసించింది.

  English summary
  US President Joe Biden has nominated Indian-American attorney Rashad Hussain as the Ambassador-at-Large for International Religious Freedom, the first Muslim to be nominated to the key position, according to the White House. Hussain, 41, is currently Director for Partnerships and Global Engagement at the National Security Council.Hussain holds a law degree from Yale Law School and has a master's degree in Arabic and Islamic Studies from Harvard University.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X