వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్: డెమొక్రాట్ల తరఫున ఎన్నికల బరిలో: తమిళ తల్లి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి నిర్వహించబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారు. ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో దిగారు. ఈ మేరకు డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ పేరును ఖరారు చేసింది. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో అదే పార్టీ నుంచి జో బిడెన్ పోటీలో ఉన్నారు. కమలా హ్యారిస్ పేరును ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ అగ్రరాజ్యం ఉపాధ్యక్ష పదవికి పోటీ పడటం ఇదే తొలిసారి.

తొలి నల్లజాతీయురాలిగా..

తొలి నల్లజాతీయురాలిగా..

అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలైన మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. 55 సంవత్సరాల కమలా హ్యారిస్ ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎంపిక అయ్యారు. యూఎస్ సెనెట్‌కు ఎంపికైన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. అలాగే సెనెట్‌కు ఎంపికైన రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ గుర్తింపు పొందారు. ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎన్నిక కాగలిగితే.. 2024లో నిర్వహించబోయే అమెరికా అధ్యక్ష పదవికి ఆటోమేటిక్‌గా నామినేట్ అవుతారు.

తమిళ మూలాలు

తమిళ మూలాలు

కమలా హ్యారిస్ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వివాహానికి ముందే ఆమె అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. వృత్తిపరంగా డాక్టర్. జమైకాకు చెందిన హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. ఆమె న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక అయ్యారు. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

కమలా హ్యారిస్ ఎంపిక వ్యూహాత్మకమే

కమలా హ్యారిస్ ఎంపిక వ్యూహాత్మకమే


భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడంలో డెమొక్రాట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టమైంది. ప్రస్తుతం అధికారం రిపబ్లికన్ల చేతిలో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయలను ఆకట్టుకోవడంలో భాగంగా.. కమలా హ్యారిస్ పేరును ఖరారు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రవాస భారతీయుల్లో చాలామందికి ఓటు హక్కు ఉంది. నల్లజాతీయురాలికి ప్రాధాన్యత ఇచ్చినట్టవుతందనీ అంటున్నారు.

Recommended Video

#Watch:వైట్‌హౌస్ వద్ద కలకలం..గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. ప్రెస్‌మీట్ నుంచి పరుగు తీసిన ట్రంప్!
కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం పట్ల

కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం పట్ల

కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడం పట్ల ప్రవాస భారతీయ సంఘాల నుంచి హర్షం వ్యక్తమౌతోంది. భారతీయులను గుర్తించినట్టయిందని ప్రవాస భారతీయుడు ఎంఆర్ రంగస్వామి వ్యాఖ్యానించారు. తాను కూడా చెన్నైకి చెందిన వాడినేనని, అదే నగరం నుంచి వచ్చిన శ్యామలా గోపాలన్‌ కుమార్తె కావడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఆసియన్ అమెరికన్ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కమలా హ్యారిస్ పేరును డెమొక్రాట్లు ఖరారు చేశారని తాను భావిస్తున్నట్లు ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

English summary
Indian-origin Senator Kamala Harris as the Vice Presidential candidate by Democratic party presidential nominee Joe Biden, saying it was a moment of pride and celebration for the entire community in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X