వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన కాబోయే ప్రెసిడెంట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Joe Biden, 14 January 2021

కరోనావైరస్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

ఈ ప్యాకేజిని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే, ఒక్కో కుటుంబానికి 1,400 డాలర్ల ప్రత్యక్షనగదు సహాయం అందించేందుకు ఒక ట్రిలియన్ డాలర్లను కేటాయిస్తారు.

అలాగే, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి 415 బిలియన్ డాలర్లను, చిన్న వ్యాపారులకు సహాయం అందించేందుకు 440 బిలియన్ డాలర్ల కేటాయిస్తారు.

అమెరికాలో 3,85,000 కన్నా ఎక్కువ మరణాలకు కారణమైన కరోనావైరస్‌ను అంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని బైడెన్ మాటిచ్చారు.

గత సంవత్సరం ఎన్నికల ప్రచారాల్లో భాగంగా..కోవిడ్‌ను అంతం చేయడంలో రిపబ్లికన్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కన్నా మెరుగైన చర్యలు తీసుకుంటామని బైడెన్ హామీ ఇచ్చారు.

శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరిగిపోతుండడంతో బైడెన్ ఉపశమన ప్రాకేజీని ప్రకటించారు.

ప్రస్తుతం అమెరికాలో రోజుకు 2,00,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య ఒక్కోసారి 4 వేలకు చేరుకుంటోంది.

జో బైడెన్ ఏమన్నారు?

బైడెన్ గురువారం రాత్రి తన స్వస్థలం డెలవేర్‌నుంచీ మాట్లాడుతూ,"కరోనా వైరస్ సంక్షోభం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కాలయాపన చేయడం అనవసరం" అని అన్నారు.

"దేశ ఆరోగ్యం తీవ్రంగా కుంటుపడింది. ఇప్పుడే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడా పొరపాట్లు జరగవచ్చు. కానీ, అభివృద్ధి విషయంలోనూ, లోపాల విషయంలో కూడా ఎల్లప్పుడూ మీతో నిజాయితీగా ఉంటాను" అని బైడెన్ తెలిపారు.

కరోనావైరస్

కరోనావైరస్ ప్రణాళిక ఏమిటి?

కోవిడ్ వ్యాక్సినేషన్ ఖర్చులకు 20 బిలియన్ డాలర్లను బైడెన్ కేటాయించారు.

ట్రంప్ ఆధ్వర్యంలో రెండు కోవిడ్ వ్యాక్సీన్ల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ, ఇది ఇంకా ఊపందుకోవాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

అమెరికాలో వ్యాక్సీన్ పంపిణీ వేగంగా ముందుకు సాగట్లేదని, దీన్ని వేగవంతం చేసే దిశగా తమ ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటుందని బైడెన్ తెలిపారు.

బైడెన్ ప్రణాళికలో భాగంగా కరోనా టెస్టులను పెంచే దిశగా 50 బిలియన్ డాలర్లు, స్ప్రింగ్ (మార్చి మొదలుకొని) కాలంలో స్కూళ్ల రీఓపెనింగ్‌కు సహాయడే పడే దిశలో 130 బిలియన్ డాలర్లను కేటాయించారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ పనికి 1,00,000 మంది ప్రజారోగ్య కార్యకర్తలను నియమించడానికి కూడా ఈ ప్రణాళిక నిధులను సమకూరుస్తుంది.

ఆర్థికపరమైన చేయూత గురించి...

దేశవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా ఉన్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వారికి అందించే అనుబంధ సహాయాన్ని వారానికి 300 డాలర్లనుంచీ 400 డాలర్లకు పెంచారు. ఈ సహాయన్నీ సెప్టెంబర్‌వరకూ పొడిగించారు. దీనితోపాటూ అద్దె చెల్లించనివారిని ఇల్లు ఖాళీ చేయించడంపై నిషేధాన్ని కూడా పొడిగించారు.

గత నెల అమల్లోకి వచ్చిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా అందిస్తున్న 600 డాలర్లకు అదనంగా 1,400 డాలర్ల ప్రత్యక్ష నగదును అమెరికన్లకు అందించనున్నాను.

ఫెడరల్ కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లు పెంచాల్సిందిగా బైడెన్ కాంగ్రెస్‌ను కోరనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందా?

ఇప్పటికే కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా అమెరికా రుణభారం పెరగడంతో కొత్త ఉపశమన ప్యాకేజీల ద్వారా దాన్ని మరింత పెంచేందుకు రిపబ్లికన్లు అంగీకరించకపోవచ్చు.

అయితే, తన ప్రణాళిక "చౌకలో సాధ్యమయ్యేది కాదని" బైడెన్ ఇంతకుముందే తెలిపారు.

జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన అధ్యక్షుడిగా కార్యాలయంలోకి అడుగు పెట్టిన తరువాత సెనేట్‌లో ట్రంప్‌పై మోపిన అభిశంసనపై విచారణ జరుగుతుంది. జరగబోయే నాటకీయ పరిణామాల నేపథ్యంలో బైడెన్ ప్రకటించిన ఉపశమన ప్యాకేజీనుంచీ దృష్టి మరలుతుందని పలువురు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The future president Joe Biden has announced a $ 1.9 trillion package for the US economy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X