వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ‘గోడ’కు బీటలు: జో బైడెన్ నేతృత్వంలో కొత్త అమెరికా, కీలక నిర్ణయాలివే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌ విధానాలకు పూర్తి భిన్నంగా ముందుకు సాగనున్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ నేత జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి రోజే 15 కీలక ఉత్తర్వులపై బైడెన్ సంతకాలు చేయనున్నారు.

Recommended Video

#TOPNEWS : AP CM YS Jagan meets Union minister Amit shah | Joe Biden Inauguration | Corona Update
ట్రంప్ మెక్సికో గోడ నిర్మాణానికి బ్రేక్.. ముస్లింలకు గ్రీన్‌సిగ్నల్

ట్రంప్ మెక్సికో గోడ నిర్మాణానికి బ్రేక్.. ముస్లింలకు గ్రీన్‌సిగ్నల్

మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల సరిహద్దుల్లో గోడను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును బైడెన్ పక్కనపెట్టనున్నారు. గోడ నిర్మాణాన్ని నిలిపివేస్తూ బైడెన్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అంతేగాక, పలు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో పర్యటించకుండా డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన నిషేధాన్ని కూడా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేయనున్నారు.

కరోనాపై పోరు.. 100 రోజులు మాస్కులు మస్ట్..

కరోనాపై పోరు.. 100 రోజులు మాస్కులు మస్ట్..

అమెరికాలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ట్రంప్ నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, లాక్‌డౌన్, షట్ డౌన్ లాంటివి కూడా అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే, బైడెన్ మాత్రం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి 100 రోజులపాటు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకునేలా ఆదేశాలివ్వనున్నారు.

ప్యారిస్ ఒప్పందంలోకి.. డబ్ల్యూహెచ్ఓలోకి కూడా..

ప్యారిస్ ఒప్పందంలోకి.. డబ్ల్యూహెచ్ఓలోకి కూడా..

ప్యారిస్ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)ల నుంచి వైదొలగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బైడెన్ మార్చనున్నారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికాను చేర్చనున్నారు. డబ్ల్యూహెచ్ఓలో భాగస్వామిని చేసే ఉత్తర్వులుపైనా బైడెన్ సంతకాలు చేయనున్నారు.

వలస విధానాలు, వీసా అంశాలపై కీలక మార్పులు

వలస విధానాలు, వీసా అంశాలపై కీలక మార్పులు

అంతేగాక, ట్రంప్ తీసుకున్న తలాతోక లేని నిర్ణయాలను కూడా బైడెన్ మార్చనున్నారు. వలస విధానం, వీసాలు లాంటి అంశాలపైనా, ఆర్థిక వృద్ధి ఊతానికి పనికొచ్చే కీలక నిర్ణయాలను బైడెన్ తీసుకోనున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వంలో మరింత ముందుకు సాగేలా ఆయన నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హారీస్ కూడా బైడెన్ తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
US President-elect Joe Biden plans to kick off his new administration on Wednesday with orders to restore the United States to the Paris climate accord and the World Health Organization, aides said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X