వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కొద్ది గంటల్లో జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11గంటలకు 'ఇనాగురేషన్' కార్యక్రమం జరగనుండగా... భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్,మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా భయం లేకపోయి ఉంటే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత అట్టహాసంగా జరిగి ఉండేది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవం కాస్త నిరాడంబరంగానే జరగనుంది.

Recommended Video

#TOPNEWS : AP CM YS Jagan meets Union minister Amit shah | Joe Biden Inauguration | Corona Update

Fact check : జో బైడెన్ ఆ హైదరాబాదీని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారా?Fact check : జో బైడెన్ ఆ హైదరాబాదీని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారా?

సాధారణ రోజుల్లో అయితే కిక్కిరిసిన జనంతో...

సాధారణ రోజుల్లో అయితే కిక్కిరిసిన జనంతో...

వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవన్ వెస్ట్ ఫ్రంట్ వద్ద అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. సాధారణ రోజుల్లో అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం వేలాది మంది జనంతో కిక్కిరిసిపోయేది. కానీ ఈసారి కరోనా దృష్ట్యా ఆ పరిస్థితి కనిపించడం లేదు. అలాగే పెన్సిల్వేనియా అవెన్యూలో నిర్వహించే ఇనాగురల్ పరేడ్‌ను కూడా ఈసారి రద్దు చేశారు. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై దాడిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 25వేల మంది జాతీయ భద్రతా బలగాలను వాషింగ్టన్‌లో మోహరించారు.

127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ బైబిల్‌పై..

127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ బైబిల్‌పై..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి దిగ్గజ డెమోక్రాట్ నేతలతో పాటు రిపబ్లికన్ అగ్ర నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అనంతరం జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో జో బైడెన్ తన సెంటిమెంట్‌గా భావించే ఫ్యామిలీ బైబిల్‌పై ప్రమాణం చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఐదు ఇంచుల మందంతో ఉండే ఈ బైబిల్‌‌కు 127 ఏళ్ల చరిత్ర ఉన్నది. 1893 నుంచి బైడెన్ కుటుంబం ఈ బైబిల్‌ను ఉపయోగిస్తున్నారు.

నిర్దిష్ట టెక్స్ట్ ఏమీ లేదు...

నిర్దిష్ట టెక్స్ట్ ఏమీ లేదు...

గతంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా బైడెన్ ఇదే బైబిల్‌పై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుమారుడు బ్యూ గతంలో డెలవార్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇదే బైబిల్‌పై ప్రమాణం చేశారు. నిజానికి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకమైన టెక్స్ట్ ఏదీ అమెరికా రాజ్యాంగంలో సూచించబడలేదు. ప్రమాణ స్వీకారంలో ఉపయోగించాల్సిన కొన్ని పదాలను మాత్రమే అది సూచిస్తుంది. అందులో 'దైవమా నాకు సహాయం చేయుము' అన్న పదం ఎక్కడా లేదు.

బైడెన్ సెంటిమెంట్...

బైడెన్ సెంటిమెంట్...

గతంలో రూజ్‌వెల్డ్,కెన్నడీ,కార్టర్ వంటి అమెరికా మాజీ అధ్యక్షులు వారి ప్రమాణ స్వీకారోత్సవంలో ఫ్యామిలీ బైబిల్‌ను ఉపయోగించారు. ఇప్పుడు బైడెన్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. మొట్టమొదటిసారిగా జనవరి 5,1973లో బైడెన్ తన ఫ్యామిలీ బైబిల్‌తో కనిపించారు. అప్పట్లో డెలావర్ నుంచి యూఎస్ సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయన ఇదే బైబిల్‌పై ప్రమాణం స్వీకారం చేశారు. అలా తన తొలినాళ్ల రాజకీయం నుంచి బైడెన్ ఈ బైబిల్‌ను సెంటిమెంటుగా భావిస్తూ వస్తున్నారు.

English summary
US President-elect Joe Biden and his deputy Kamala Harris will be sworn in as the 46th President and 49th Vice-President of the United States today, January 20. Ms Harris will make history as America's first woman, first Black and first person with south Asian roots to take the office of the Vice President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X