వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ జిన్‌పింగ్‌ సహకారం కోరారా? బాంబు పేల్చిన సొంతమనిషి

|
Google Oneindia TeluguNews

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆదినుంచి వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఏదో ఒక రూపంలో ట్రంప్ మెడకు ఈ వివాదాలు చుట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ రాసిన పుస్తకం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇంతకీ జాన్ బోల్టన్ ఆ పుస్తకంలో ఏం వివరించారు.. ఆ పుస్తకం విడుదల కాకుండా ట్రంప్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు..?

Recommended Video

Donald Trump ఆశలపై నీళ్లు, John Bolton Book అమెరికా రాజకీయాల్లో దుమారం..!!
జిన్ పింగ్ సహకారం కోరిన ట్రంప్

జిన్ పింగ్ సహకారం కోరిన ట్రంప్

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఆదేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ తన పుస్తకం ద్వారా పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. బయటకు మాత్రం చైనాపై నిప్పులు కక్కే ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో రెండో సారి తన గెలుపునకు సహకరించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కోరినట్లు తన పుస్తకం " ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్"లో చెప్పి బాంబు పేల్చారు. అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా కొనుగోలు చేసి తన విజయానికి సహకరించాలని జిన్‌ పింగ్‌ను కోరినట్లు జాన్ బోల్టన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక ట్రంప్ విదేశీ విధానాలు ఎలా ఉంటాయో బోల్టన్ చెప్పారు. అసలే రెండో సారి గెలవడంపై అంతంత మాత్రమే అవకాశాలున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బోల్టన్ బుక్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లింది.

ట్రంప్ సొంత ప్రయోజనాలకోసమే పనిచేశారు

ట్రంప్ సొంత ప్రయోజనాలకోసమే పనిచేశారు

వచ్చే వారంలో జాన్ బోల్టన్ పుస్తకం విడుదల కానుండగా... గతేడాది జపాన్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో ట్రంప్ జిన్‌ పింగ్ చర్చలను బోల్టన్ బయటపెట్టారు. తన గెలుపునకు సహకరించాల్సిందిగా ట్రంప్ జిన్‌పింగ్‌ను పదేపదే అభ్యర్థించారని అయితే ట్రంప్ మాట్లాడిన మాటలను కొన్ని కారణాల వల్ల యథాతథంగా రాయలేకపోతున్నట్లు బోల్టన్ పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రయోజనాలను పక్కన బెట్టి ట్రంప్ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని బోల్టన్ ఆరోపణలు చేశారు. ఆయన తీసుకునే విదేశీ విధానాల నిర్ణయాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా సొంత లబ్ధి జరిగేలా తీసుకునేవారని బోల్టన్ స్పష్టం చేశారు.

పుస్తకం విడుదల కాకుండా ట్రంప్ ప్రయత్నం

పుస్తకం విడుదల కాకుండా ట్రంప్ ప్రయత్నం

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉండదని స్పష్టం చేసింది చైనా. అది అమెరికా అంతర్గత వ్యవహారమని ఇందులో చైనా చేసేదేమీ లేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ చెప్పారు. ఇక పుస్తకంలో వరుస బాంబులు పేల్చారని సమాచారం ఉండటంతో వెంటనే జాన్ బోల్టన్ పుస్తకం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ట్రంప్ సర్కార్ వాషింగ్టన్ కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటికే పుస్తకం కాపీలు తమకు అందడంతో ప్రముఖ దినపత్రికలైన న్యూయార్క్ టైమ్స్ మరియు వాషింగ్టన్ పోస్టులు కథనాలను ప్రచురితం చేశాయి. ఇదిలా ఉంటే ట్రంప్ కూడా బోల్టన్ పై ఎదురుదాడి చేశారు. బోల్టన్ చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బోల్టన్ వైట్ హౌజ్‌లోకి అడుగుపెట్టడంతోనే ఏదో కుట్రతో అడుగుపెట్టారని దుయ్యబట్టారు. బోల్టన్ ఒక అబద్ధాల పుట్టగా ట్రంప్ అభివర్ణించారు. తన పై ఆరోపణలు అవాస్తవాలు చెబితే పుస్తకం బాగా సేల్ అవుతుందని అందుకే రాసినట్లున్నారని బోల్టన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు.

ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడు

ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడు

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని తీవ్ర ఆరోపణలు చేశారు జాన్ బోల్టన్. రెండో సారి తిరిగి అధికారంలోకి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్న ట్రంప్‌కు కరోనా వైరస్ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలు శాపంగా మారుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు నల్లజాతి వ్యక్తి హత్యపై అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన నిరసనలతో ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇవిలా ఉండగానే పుండుపై కారం చల్లినట్లుగా బోల్టన్ తన పుస్తకం ద్వారా పదునైన అస్త్రాలను వదిలారు. వ్లాదిమిర్ పుతిన్‌లానే చైనా కూడా అమెరికాతో ఆడుకోవాలని చూస్తోందని బోల్టన్ చెప్పారు.

కిమ్ జాంగ్‌తో చర్చలు విఫలమవడానికి కారణం బోల్ట్

కిమ్ జాంగ్‌తో చర్చలు విఫలమవడానికి కారణం బోల్ట్

ఇక బోల్ట్ పై కూడా పలు ఆరోపణలు చేశారు ట్రంప్. ఉత్తరకొరియాతో అమెరికా చర్చలు విఫలమవడానికి కారణం జాన్ బోల్టన్ అని ట్రంప్ విమర్శలు గుప్పించారు. జాతీయ భద్రత సలహాదారుడి హోదాలో అప్పుడున్న బోల్టన్ అణ్వాయుధాలపై ఉత్తరకొరియాతో జరిగిన చర్చల్లో సలహాలు ఇచ్చారని ట్రంప్ గుర్తు చేశారు. ఉత్తరకొరియాతో కూడా లిబియాతో వ్యవహరించినట్లుగానే అమెరికా వ్యవహరించాలని చెప్పి చర్చలను పక్కదోవ పట్టించారని ట్రంప్ మండిపడ్డారు. లిబియా విధానంను ఉత్తరకొరియాకు వివరించినప్పుడు అమెరికాను కిమ్ జాంగ్ ఉన్ లెక్క చేయలేదని ట్రంప్ చెప్పారు. లిబియాతో వ్యవహరించిన విధానం తప్పని బోల్టన్ వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాత ట్రంప్ కామెంట్ చేశారు. బోల్టన్ ఇచ్చిన సలహాలపై మండిపడ్డ కిమ్ జాంగ్ ఉన్న అసలు తన సమపంలో బోల్టన్ ఉండటాన్ని ఇష్టపడలేదని ట్రంప్ ట్వీట్ చేశారు.

English summary
U.S. President Donald Trump's presidency was in turmoil Thursday after top ex-aide John Bolton declared him unfit for office in a bombshell book and the Supreme Court blocked a key part of his re-election vow to deport undocumented migrants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X