వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్షుడి సంచలన నిర్ణయం: గర్భిణీ విద్యార్థినిలకు స్కూల్స్, కాలేజీల్లో 'నో ఎంట్రీ'!

టాంజానియా అధ్యక్షుడు మగుఫులీ.. గర్భవతులను పాఠశాలలు, కాలేజీల్లోకి అనుమతించరాదని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడి తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

|
Google Oneindia TeluguNews

డొడొమా: స్త్రీలపై వివక్ష ప్రదర్శించేలా టాంజానియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గర్భం ధరించిన విద్యార్థినులు విద్యాలయాలకు రావద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అక్కడి ప్రజలు భగ్గమంటున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

కాగా, టాంజానియా అధ్యక్షుడు మగుఫులీ.. గర్భవతులుగా ఉన్న విద్యార్థినులను పాఠశాలలు, కాలేజీల్లోకి అనుమతించరాదని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడి తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆఫ్రికాకు చెందిన ఓ మహిళా సంఘం డిమాండ్ చేసింది.

John Magufuli's pregnant schoolgirl ban angers Tanzanian women

అధ్యక్షుడి నిర్ణయం టీనేజీలోనే గర్భవతులవుతున్న విద్యార్థినులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. తమ కెరీర్ ఏమవుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే, అత్యంత పేద దేశమైన టాంజానియాలో ఉపాధి అవకాశాలు గగనమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారిని చదువుకు కూడా దూరం చేస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.

ప్రపంచ దేశాలన్ని మహిళలను అన్ని రంగాల్లోను ప్రోత్సహించేలా వ్యవహరిస్తుంటే.. టాంజానియా అధ్యక్షుడు మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు అక్కడి యువత. భారీ ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు తన నిర్ణయంపై వెనక్కి తగ్గుతాడా? లేడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Tanzania's President John Magufuli has been condemned for comments that girls who give birth should not be allowed to return to school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X