వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ గుడ్‌న్యూస్: సానుకూల ఫలితాలు, చివరి దశలో ప్రయోగం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండగా, భారత్ సహా పలు దేశాల నుంచి వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. తాజాగా, జాన్సన్ అండ్ జాన్సన్ తన కరోనా వ్యాక్సిన్ గురించిన కొత్త సమాచారాన్ని వెల్లడించింది.

కరోనా బారినపడకముందు ఆ మహమ్మారిపై పాట పాడిన ఎస్పీ బాలుకరోనా బారినపడకముందు ఆ మహమ్మారిపై పాట పాడిన ఎస్పీ బాలు

ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు

ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు


ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వ అనుమతి లభించింది. దీంతో వెయ్యి మందికిపైగా వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా.. ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభించింది. ఇందులోనూ ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నట్లు సంస్థ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది.

60వేల వాలంటీర్లపై..

60వేల వాలంటీర్లపై..

ఈ వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం 60వేల మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు. వీరిలో 65 ఏళ్లకు పైబడిన వారు 15 మంది మాత్రమే ఉన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వాలంటీర్లలో వ్యాధి నిరోధక స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది.

ఈ ఏడాది చివరలో లేదా వచ్చే జనవరిలో వ్యాక్సిన్..

ఈ ఏడాది చివరలో లేదా వచ్చే జనవరిలో వ్యాక్సిన్..

చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది చివరిలోపు గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మొదటి ప్రయోగదశలో భాగంగా గత జులైలో తొలుత కోతులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ అన్ని రకాల వయస్సులవారిపై సానుకూల ప్రభావం చూస్తిస్తుందా? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక డోసు వల్ల వృద్దుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయోననే అనుమానాలున్నాయి.

ఒకే ఒక్క డోసుతో.. కొన్ని అనుమానాలు..

ఒకే ఒక్క డోసుతో.. కొన్ని అనుమానాలు..

ఈ అన్ని అనుమానాలకు తెరపడాలంటే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తుది దశ ట్రయల్స్ పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందేనని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బ్యారీ బ్లూమ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రయోగ దశలో ఉన్న దాదాపు అన్ని వ్యాక్సిన్లు రెండు డోసులతో కరోనా తగ్గిస్తాయని చెబుతుంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం ఒకే ఒక్క డోసుతో కరోనాను దూరం చేస్తామని చెబుతుండటం గమనార్హం. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్.. అమెరికాలో ఫైనల్ ప్రయోగ దశకు చేరుకున్న నాలుగో టీకా కావడం గమనార్హం.

English summary
The US pharmaceutical and medical device company Johnson and Johnson has developed a vaccine that in the early trials showed a strong immune response to the novel coronavirus with a single dose, an interim report published on the medical website medRxiv revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X