వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్‌1బీ వీసాలపై భారతీయులకు ఊరట- ట్రంప్‌ ఆదేశాలు తోసిపుచ్చిన అమెరికా కోర్టు

|
Google Oneindia TeluguNews

అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఏటా ఇచ్చే హెచ్‌1బీ వీసాల్లో భారీగా కోత విధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పట్లో ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడింది. ఇప్పుడు ట్రంప్ ఓటమి నేపథ్యంలో ఆ ఆదేశాలను ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి కొట్టేయడం సంచలనం రేపుతోంది.

Recommended Video

H1B Visa : త్వరలో H1B వీసాల పునరుద్ధరణ.. India,China తో పాటు పలు దేశాల నిపుణులకు భారీగా అవకాశాలు!

ఏటా భారత్‌తో పాటు ఇతర విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాల్లో కోత విధిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం మేరకు వెలువడిన ఆదేశాలను అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కొట్టేశారు. వాస్తవానికి అమెరికా ఏటా టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్‌1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్‌, చైనాకు చెందిన వారే ఉన్నారు.

Judge throws out Trump rules limiting skilled-worker visas

కానీ ట్రంప్‌ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది చివరి వరకూ హెచ్‌1బీ వీసాలు విడుదల చేయకుండా నిషేధం విధించారు. ఈ నిర్ణయాన్ని అమెరికాలోని పలు ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు కోర్టుల్లో సవాల్‌ చేశాయి. వీటిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్‌ నిర్ణయాన్ని కొట్టేసింది. దీంతో బైడెన్‌ ప్రభుత్వం త్వరలో ఈ వీసాల పునరుద్ధరణకు అవకాశం దక్కింది. బైడెన్‌ సర్కారు వీటిని పునరుద్ధరిస్తే భారత్‌, చైనాతో పాటు పలు దేశాల నుంచి అమెరికాకు వచ్చే నిపుణులకు భారీగా అవకాశాలు దొరకనున్నాయి.

English summary
a federal court judge on tuesday struck down two trup administration rules designed to drastrically curtail the number of visas issued each year to skilled foreign workers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X