వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు 50వారాలు జైలుశిక్ష

|
Google Oneindia TeluguNews

లండన్ : బెయిల్ విచారణకు హాజరుకాకుండా ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్న వికీలీక్స్ వ్యవస్థాపకులు జూలియన్ అసాంజేకు 50 వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు బ్రిటీష్ జడ్జి దెబోరా టేలర్. అసాంజే ఏడేళ్లు పాటు ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకోవడం వల్ల బ్రిటన్‌కు పన్నుకడుతున్నవారి డబ్బు దాదాపు 16 మిలియన్ పౌండ్లు ఖర్చు అయ్యిందని జడ్జి అన్నారు. అంతేకాదు విచారణలో జాప్యం జరగాలన్న ఉద్దేశంతోనే అసాంజే ఆ ఎంబసీలో ఆశ్రయం కోరారని జడ్జి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఇక న్యాయమూర్తి తీర్పును చదువుతున్న సమయంలో జూలియన్ అసాంజే చేతులు కట్టుకుని నిల్చున్నారు. పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న అసాంజే మద్దతు దారులు అతన్ని పోలీసులు తీసుకెళుతున్న సమయంలో అనుకూల నినాదాలు చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అసాంజే జూన్ 2012లో దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్‌కు సంబంధించి లండన్‌లో ఉన్న ఎంబసీలో తల దాచుకున్నాడు. ఆ సమయంలో ఆయనపై పలు లైంగిక వేధింపుల కేసులు స్వీడెన్‌లో నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉండగా జూలియన్ అసాంజే డుమ్మాకొట్టాడు.

Julian Assange senteced for 50 weeks by london court

ఇదిలా ఉంటే తన క్లయింట్ ఎంబసీ నుంచి బయటకు వస్తే ఆయన్ను తిరిగి అమెరికాకు అప్పజెప్తారన్న భయం ఉందని అందుకే బయటకు రాలేదని అసాంజే తరపున వాదిస్తున్న లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అమెరికా ప్రభుత్వం తనపై ఉగ్రవాద ముద్ర వేసి జైలుకు పంపిస్తుందన్న భయం తన క్లైంట్‌లో నెలకొందని కోర్టుకు తెలిపారు. అయితే 2012లో ఆ సమయంలో తనకు ఏది మంచి అని తోచిందో అదే చేసినట్లు ఓ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాల్సిందిగా కూడా లేఖలో పేర్కొన్నాడు. తాను రాసిన లేఖను లాయర్ కోర్టులో చదవి వినిపించారు.

జూలియన్ అసాంజేకు ఈక్వెడార్ ఆశ్రయం కల్పించబోవడం లేదనే ప్రకటన ఏప్రిల్ 11న చేశాక లండన్ పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు. అసాంజేను అమెరికాకు అప్పజెప్పాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారణ చేయనుంది కోర్టు. అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ రహస్యాలను బహిరంగం చేశారనే ఆరోపణలు అసాంజేపై ఉన్నాయి.

English summary
A British judge sentenced WikiLeaks founder Julian Assange on Wednesday to 50 weeks in prison for skipping bail seven years ago and holing up in the Ecuadorian embassy.Judge Deborah Taylor said it was hard to imagine a more serious version of the offense as she gave the 47-year-old hacker a sentence close to the maximum of a year in custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X