వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈక్వెడార్ షాక్: లండన్‌లో వికీలీక్స్ జులియన్ అసాంజే అరెస్ట్

|
Google Oneindia TeluguNews

లండన్: వికీలీక్స్ కో-ఫౌండర్ జులియన్ అసాంజే అరెస్ట్ అయ్యాడు. లండన్‌లోని ఈక్వేడార్ ఎంబసీ నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో స్వీడన్ పోలీసులు అరెస్ట్ చేయకుండా అసాంజే ఏడేళ్ల క్రితం ఈ ఎంబసీలో ఆశ్రయం పొందాడు.

అయితే అసాంజే పలుమార్లు అంతర్జాతీయ ఒప్పందాల్ని ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఒప్పందాల ఉల్లంఘన నేపథ్యంలో తాము ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు దౌత్య కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో ఎంబసీ నుంచి వెళ్లడానికి అసాంజే అంగీకరించలేదు. తాజాగా, ఆయనను అరెస్ట్ చేశారు. అతనిని లండన్‌లోని సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెడతారు.

Julian Assange: Wikileaks co founder arrested in London

దీనిపై వికీలీక్స్ స్పందించింది. ఈక్వెడార్ చాలా అన్యాయంగా రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. వికీలీక్స్ అలా చెప్పిన కాసేపటికే అసాంజే అరెస్ట్ అయ్యాడు.

అసాంజే పోలీస్ కస్టడీలో ఉన్నాడని, ఆయన యూకేలో న్యాయ విచారణ ఎదుర్కోనున్నారని, తమకు సహకరించినందుకు ఈక్వెడార్‌కు థ్యాంక్స్ అని, ఈ విషయంలో పోలీసులు ఎంతో నిబద్దతతో వ్యవహరించారని, వారికి అభినందనలు అని హోం సెక్రటరీ ట్వీట్ చేశారు.

English summary
Mr Assange took refuge in the embassy seven years ago to avoid extradition to Sweden over a sexual assault case that has since been dropped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X