వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీడన్ యువతిపై రేప్, లొంగిపోతా: 'వికీలీక్స్' అసాంజే

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: తన పిటిషన్‌ను ఐక్య రాజ్య సమితి కొట్టి వేస్తే బ్రిటన్ పోలీసుల ముందు శుక్రవారం నాడు లొంగిపోతానని వికీలీక్స్ వ్యవస్థాపకులు జూలియన్ అసాంజే తెలిపాడు. స్వీడన్‌లో అత్యాచార కేసును ఎదుర్కొంటున్న అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నాడు.

అయితే ఆ కేసుకు సంబంధించి అతను 2014లో ఐక్య రాజ్య సమితికి ఫిర్యాదు చేశాడు. దానిపై ఈ శుక్రవారం తీర్పును వెలువరించనుంది. అసాంజే స్వేచ్ఛపై యూఎన్ ప్యానెల్ ఆ తీర్పులో ప్రస్తావిస్తుంది. ఒకవేళ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే బ్రిటన్ పోలీసుల ముందు లొంగిపోతానన్నాడు.

Julian Assange 'will surrender' if UN rules against him

ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే తాను వెంటనే పాస్‌పోర్ట్‌ను పొందనున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే కొన్నేళ్ల క్రితం అమెరికా ప్రభుత్వానికి చెందిన వేలాది రహస్య పత్రాలను విడుదల చేశాడు. దాంతో అప్పట్లో అతను వార్తల్లోకి ఎక్కాడు. అయితే అతనిపై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది.

అసాంజే తనను రేప్ చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. దానిపై ప్రస్తుతం అతను కేసును ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ స్వీడన్‌కు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను అమెరికాకు అప్పగిస్తుందని అసాంజే అనుమానిస్తున్నాడు. అప్పుడు అమెరికా తనను ఉరి తీస్తుందని అతను అభిప్రాయపడ్డాడు.

వికీలీక్స్‌కు సంబంధం లేకుండా రేప్ కేసులో ఇరుక్కున్న అసాంజేపై స్వీడన్ 2010లో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో అసాంజే లండన్‌లో ఉన్నాడు. అరెస్ట్ వారెంట్‌పై వేసిన అభ్యర్థనను కోర్టు కొట్టి పారేసింది. దాంతో అతను ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నాడు.

English summary
Wikileaks founder Julian Assange has said he will turn himself over to UK police on Friday if a UN panel rules he has not been unlawfully detained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X