వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

136 ఏళ్లలో అత్యంత వేడి ఏ నెలలో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భూమిపై గత 136 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత అత్యంత ఎక్కువగా నమోదైన నెలగా 2016 జులై నెల రికార్డు సృష్టించింది. నాసాకు చెందిన గొడార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ ఈ వివరాల నివేదిక వెల్లడించింది.

1880లో అధునిక ఉష్టోగ్రతల నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి భూమి పై అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 2016లోనే నమోదు అయ్యిందని వెల్లడించింది. 2009, 2011, 2015 జులై నెలతో పోల్చారు.

July 2016 was Worlds hottest month since records began:NASA

ఆ జులై నెలలతో పోల్చుకుంటే 2016 జులై లో సరాసరి 0.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యిందని నివేదిక తెలిపింది. సాధారణంగా మిగిలిన నెలల్లో నమోదు అయ్యే ఉష్ణోగ్రతతో పోల్చితే జులై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.

వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరగడంతో పాటు ఇతర కారణాల వలన ప్రతి సంవత్సరం క్రమంగా ఉష్ణోగ్రత పెరిగి కలవరపెడుతున్నాయని నాసాకు చెందిన గొడార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ వెల్లడించింది.

English summary
As the string of hottest months continues, 2016 is virtually certain to be the hottest year on record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X