వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Google pixel 4xl: లీకైన స్మార్ట్ ఫోన్ ఫోటోలు, ధర ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

గూగుల్ నుంచి విడుదల కానున్న ప్రీమియం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 4 ఫీచర్స్‌కు సంబంధించి గత కొన్ని నెలలుగా సమాచారం లీక్ అవుతూ వస్తోంది. గేమింగ్ రివ్యూల నుంచి ఫీచర్లదాకా.. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ నుంచి అన్నీ లీకవుతున్నాయి. ఇక తాజాగా మరో ఫోటో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఇది గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్ఎల్‌కు సంబంధించిన ఫోటోగా తెలుస్తోంది.

అద్భుతమైన ఫినిషింగ్

అద్భుతమైన ఫినిషింగ్

గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అన్ని యాంగిల్స్ ఈ ఫోటోలో కవర్ అయ్యాయి. గ్లాసు నుంచి ఫోనును తయారు చేయడం జరిగింది. బ్యాక్ ప్యానెల్ కూడా టచ్ చేస్తే చాలా స్మూత్‌గా ఉందని ఓ గ్యాడ్జెట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇందులోని డిస్‌ప్లే కూడా చాలా స్మూత్‌గా ఉండటంతో ఇట్టే ఆకట్టుకుంటుందని పేర్కొంది. రిఫ్రెష్‌ రేట్ 60 హెర్ట్జ్ నుంచి 90 హెర్ట్జ్‌గా ఉందని తెలిపింది.

టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇవే..!

టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇవే..!

ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూస్తే గూగుల్ పిక్సెల్ 4ఎక్స్‌ఎల్ 6.23 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని తెలిపింది. దీని రిజల్యూషన్ 3040 * 1440 పిక్సెల్‌గా వెల్లడించింది. ఇక పిక్సెల్ 4ఎక్స్‌ఎల్ ప్రాసెసర్ విషయానికొస్తే... ఇందులో పాత క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇది 6జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో వస్తున్నట్లు వెల్లడించింది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12.2 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండగా.. రియర్ కెమరా 8.1 మెగాపిక్సెల్‌తో వస్తున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్ 15న లాంచ్ కానున్న పిక్సెల్ 4,4ఎక్స్ఎల్

అక్టోబర్ 15న లాంచ్ కానున్న పిక్సెల్ 4,4ఎక్స్ఎల్

గత కొద్దిరోజులుగా గూగుల్ పిక్సెల్ 4 మరియు పిక్సెల్ 4ఎక్స్ఎల్ ఫోన్లు అక్టోబర్‌15న మార్కెట్లోకి విడుదలవుతాయని వార్తలు జోరుగా షికారు చేశాయి. అన్నట్లుగానే గూగుల్‌ సంస్థ కూడా ఇదే తేదీని అధికారికంగా ప్రకటించింది. తమ సంస్థ నుంచి విడుదల అవుతున్న లేటెస్ట్ ఫోన్ల గురించి న్యూయార్క్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. నెస్ట్ మినీ కూడా ఇదే కార్యక్రమంలో లాంచ్ చేయాలని తాము భావిస్తున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలిపింది.

 రెండు వేరియంట్ల ధర కాస్త ఎక్కువే..!

రెండు వేరియంట్ల ధర కాస్త ఎక్కువే..!

గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్ వేరియంట్‌లతో పోలిస్తే పిక్సెల్ 4 మరియు పిక్సెల్ 4 ఎక్స్ఎల్ మోడల్స్ కాస్త ధర ఎక్కువే అని చెప్పాలి. పిక్సెల్ 4 ధర 739 పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దీని విలువ రూ.65వేలు ఉండే అవకాశం ఉంది. అదే పిక్సెల్ 4ఎక్స్ఎల్ ధర 995 పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.88వేలు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రెండు వేరియంట్ల ఫోన్లు 64 జీబీ 128 జీబీలలో లభ్యమవుతాయని తెలుస్తోంది. బ్లాక్, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో గూగుల్ కొత్త మోడల్ ఫోన్స్ రానున్నాయి.

English summary
New high resolution images of Google Pixel 4 XL smartphone have leaked ahead of launch. These images give a 360-degree view of Google's upcoming budget smartphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X