వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల అట్టహాసం: కాబూల్ లో 30 మంది బలి

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ ప్రధాన భద్రతా కార్యాలయం వద్ద మంగళవారం ఉగ్రవాదులు ట్రక్కు బాంబు పేల్చి వేశారు. ఈ బాంబు పేలుడులో 30 మంది దుర్మరణం చెందారు. 350 మందికి పైగా తీవ్రగాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బాంబు పేలుడుకు తామే బాధ్యులమని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. పేలుడు పదార్థాలు, బాంబులతో నిండిన ట్రక్కును ప్రభుత్వ కార్యాలయంలోని వాహనాల పార్కింగ్ దగ్గరకు తీసుకు వెళ్లారు. తరువాత ఆత్మాహుతి దళ సభ్యడు తనను తానే పేల్చేసుకున్నాడు.

ఈ బాంబు దాడిలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయంలో పనులు చేయించుకోవడానికి వచ్చిన 30 మంది పౌరులు అక్కడికక్కడే మరణించారని, 350 మందికి పైగా గాయపడ్డారని కాబూల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ రెహమాన్ రహిమి మీడియాకు చెప్పారు.

Kabul Bombing Blast kills 30, Militants storm Government site

ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని ఆయన అన్నారు. బాంబు పేలుడు తురువాత ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అమలుకున్నాయని తెలిపారు. కిలో మీటరు దూరంలో ఉన్న భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.

బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో అఫ్గాన్ భద్రతా సంస్థలతో పాటు అమెరికా రాయబార కార్యాలయం, ఇతర విదేశీ ముఖ్య సంస్థలు ఉన్నాయని అబ్దుల్ రెహమాన్ రహిమి వివరించారు. పేలుడు జరిగిన కొద్ది దూరంలోనే ఆఫ్గాన్ రక్షణా కార్యాలయం, అధ్యక్ష భవనం ఉందని చెప్పారు.

బాంబు పేలుడు జరిగిన తరువాత భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని అన్నారు. ఉగ్రవాదులు యుద్ధ నేరం చేశారని, వారిని పట్టుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని ఇదే సంవత్సరంలో తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు.

తాలిబన్లు ప్రకటించిన తరువాత ఇదే మొదటి సారి బాంబు పేలుడు జరిగిందని అధికారులు అంటున్నారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని ఆఫ్గాన్ దేశ అంతర్గత భద్రతా శాఖ మంత్రి
సిద్దిఖీ స్పష్టం చేశారు.

గాయపడిన వారిలో చాల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మా ఉగ్రవాదులు నిఘా విభాగ కార్యాలయమైన నేషనల్ డెరైక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీలోకి ప్రవేశించారంటూ తాలిబన్ ప్రతినిధి జబీవుల్లా ప్రకటించారు. అయితే ఆఫ్గాన్ ప్రభుత్వం తాలిబన్ ప్రతినిధి జబీవుల్లా వ్యాఖ్యలను ఖండించింది.

ప్రభుత్వంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే భద్రతా కార్యాలయం లక్షంగా ఉగ్రవాదులు దాడులు చేశారని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని చెప్పారు.

English summary
The four hour assault began when the militants detonated a bus full of explosives outside the the National Directorate of Security compound.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X