వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదరగొట్టిన కమలా హ్యారిస్: 83 రోజులే టైమ్: అమెరికా తలరాత: నాయకత్వ శూన్యత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థినిగా డెమొక్రాట్ల తరఫున ఎన్నికైన కమలా హ్యారిస్ తొలి స్పీచ్‌లో అదర గొట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అధ్యక్ష పదవి అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి తొలి ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ పేరును ఖరారు చేసిన తరువాత ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించడం ఇదే తొలిసారి. జో బిడెన్ స్వస్థలం డెలావర్‌లో ఈ సభను నిర్వహించారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఆమె మాట్లాడారు.

Recommended Video

Kamala Harris - 'US Crying Out For Leadership' || Oneindia Telugu

కమలా హ్యారిస్ తాత ఏం చేసేవారో తెలుసా: 60 ఏళ్ల కిందటే ఒంటరిగా: చెన్నై టు కాలిఫోర్నియాకమలా హ్యారిస్ తాత ఏం చేసేవారో తెలుసా: 60 ఏళ్ల కిందటే ఒంటరిగా: చెన్నై టు కాలిఫోర్నియా

అగ్రరాజ్యానికి నాయకత్వ శూన్యత..

అగ్రరాజ్యానికి నాయకత్వ శూన్యత..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమర్శలను సంధించారు. అమెరికాను ప్రస్తుతం నాయకత్వ శూన్యత వెంటాడుతోందని కమలా హ్యారిస్ విమర్శించారు. అన్ని రంగాల్లోనూ బలోపేతంగా ఉన్న అమెరికాలో నాయకత్వ శూన్యత ఏర్పడటం ఏ మాత్రం మంచిది కాదని, త్వరలోనే తాము దాన్ని భర్తీ చేస్తామని చెప్పారు. నాయకత్వ శూన్యతను తొలగించే శక్తి సామర్థ్యాలు తమకే ఉన్నాయని అన్నారు.

డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌లపై తీవ్రమైన కేసులు..

డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌లపై తీవ్రమైన కేసులు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయని, వాటిపై ఒక్క సమగ్ర దర్యాప్తు కూడా ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. వారిద్దరిపై కేసులు నమోదైన వెంటనే మూసివేస్తుంటారని ఎద్దేవా చేశారు. తనను అధ్యక్షుడిగా గెలిపించిన ప్రజల కంటే ట్రంప్‌కు తనపైనే తనకు శ్రద్ధ అధికమని, అందుకే బయటికి రావాలన్నా, ప్రజల్లో తిరగాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారని విమర్శించారు.

ఒబామా, జో బిడెన్‌ల సహకారం..

ఒబామా, జో బిడెన్‌ల సహకారం..

డెమొక్రటిక్ తరఫున అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడిగా జో బిడెన్ అమెరికాను ఓ దశాబ్దకాలం పాటు అన్ని రంగాల్లోనూ బలోపేతం చేశారని కమలా హ్యారిస్ చెప్పారు. అమెరికాను ఆర్థికంగా ఎంతగా బలోపేతం చేశారో.. డొనాల్డ్ ట్రంప్.. అంతగా దిగజార్చారని విమర్శించారు. ఆర్థిక, వైద్య రంగాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందని, ఫలితంగా ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు రంగాలు.. అత్యంత దయనీయ స్థితికి చేరుకున్నాయని ధ్వజమెత్తారు.

కరోనా సంక్షోభ పరిస్థితుల్లో..

కరోనా సంక్షోభ పరిస్థితుల్లో..

కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను ట్రంప్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని కమలా హ్యారిస్ విమర్శించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుడు దేశాన్ని ముందుండి నడిపించాల్సి ఉంటుందని, అమెరికాలో దీనికి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌ల నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తమ దేశ భవిష్యత్తును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

English summary
Kamala Harris declared that the United States is "crying out for leadership" in her first joint appearance Wednesday with Joe Biden as his pick for vice president on the Democratic ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X