• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చరిత్ర సృష్టించబోతున్న కమలా హ్యారిస్‌- చాలా అంశాల్లో ప్రప్రథమంగా- హద్దులు దాటుకుంటూ

|

అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న భారతీయ, జమైకన్‌ అమెరికన్‌ కమల హ్యారిస్‌పై ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అధ్యక్షుడు బైడెన్‌ అయినా కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యంలో కొత్త ప్రభుత్వానికి రథసారధి కానున్నట్లు తెలుస్తోంది. బైడెన్ వయసు, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కమల భారీ బాధ్యత మోయాల్సి ఉంటుంది. అటు జంబో ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు ఆగ్రరాజ్యం బాధ్యతలు మోయబోతున్న కమల ఈ డ్యూయల్‌ రోల్‌ ఎలా పోషిస్తారని భారత్‌తో పాటు పలు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 కమలా హ్యారిస్‌ ఎన్నింట్లో ఫస్టో తెలుసా ?

కమలా హ్యారిస్‌ ఎన్నింట్లో ఫస్టో తెలుసా ?

అమెరికా ఉపాధ్యక్షురాలిగా రేపు క్యాపిటల్‌ భవనం వద్ద ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమలా హ్యారిస్‌ చాలా విషయాల్లో ప్రప్రథమం కాబోతున్నారు. వీటిలో అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలిగా, మొదటి నల్లజాతి మహిళగా, భారతీయ సంతతికి సంతతికి చెందిన తొలి మహిళగా ఆమె నిలవబోతున్నారు. తద్వారా అమెరికా చరిత్రలోనే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఉపాధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు. గతంలో అమెరికాలో ఇలా ఎప్పుడూ జరగలేదు.

 కమలా హ్యారిస్‌ జంబో ఫ్యామిలీ

కమలా హ్యారిస్‌ జంబో ఫ్యామిలీ

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే వేళ కమలా హ్యారిస్‌కు చెందిన జంబో ఫ్యామిలీ అంతా అక్కడ ప్రత్యక్ష్యం కాబోతోంది. ఇందులో ఆమె కుటుంబం, ఆమె మేనకొడలు మీనా హారిస్‌, ఆమె సవతి కుటుంబం, పిల్లలు ఇలా చాలా మందే ఉన్నారు. అన్నింటికీ మించి కమల భర్త ఎల్లా ఎమ్హాఫ్‌ కూడా ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. దేశంలో రెండో పౌరురాలిగా మారబోతున్న కమలా హ్యారిస్‌తో పాటు ఆమె భర్త ఎల్లా ఎమ్హాఫ్‌ కూడా ఆమెతో కలిసి ఇకపై దర్శనం ఇవ్వబోతున్నారు.

 జాతి, లింగ భేదాల హద్దులు దాటుకుంటూ

జాతి, లింగ భేదాల హద్దులు దాటుకుంటూ

కమలా హ్యారిస్‌ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలే కాదు శ్వేత జాతీయుల హవా కొనసాగే అగ్రరాజ్యంలో జాతి, లింగ భేదాలు చెరిపోయబోతున్న ఓ భారతీయ-జమెకన్‌ మూలాలున్న అమెరికన్ కూడా. హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో పెరిగిన కమల యూదు జాతీయుడైన ఎల్లా ఎమ్హాఫ్‌ను వివాహం చేసుకున్నారు. 40 ఏళ్ల ప్రాయంలో ఎల్లా ఎమ్మాఫ్‌ను పెళ్లి చేసుకున్న కమలకు ఇప్పటికీ పిల్లల్లేరు. తన భర్త మొదటి భార్య సంతానాన్నే తన పిల్లలుగా చూసుకుంటూ కమల జీవితం గడిపేస్తున్నారు. విచిత్రంగా సవతి కూడా ఆమె స్నేహితురాలే.

 ప్రథమ, ద్వితీయ మహిళలకు భిన్నంగా

ప్రథమ, ద్వితీయ మహిళలకు భిన్నంగా

గతంలో అమెరికాకు ప్రథమ మహిళలుగా వ్యవహరించిన లారా బుష్‌ అక్షరాస్యత, మిషెల్‌ ఒబామా అరోగ్యకరమైన ఆహారం, జిల్‌ బైడెన్‌ సైనిక కుటుంబాలపై దృష్టిపెట్టారు. ఇక ట్రంప్‌ సతీమణి మెలానియా అయితే బెదిరింపులకు కౌంటర్‌ ఇచ్చే లక్ష్యంతో బీ బెస్ట్‌ ప్రచారం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు కమల ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి ప్రథమ మహిళలు, ద్వితీయ మహిళలు తమ భర్తలకు అండగా ఉన్నారు. కానీ కమల నేరుగా తానే పదవిలో ఉన్నారు. దీంతో కమల వేసే అడుగులపై ఆసక్తి పెరుగుతోంది.

English summary
As Kamala Harris ascends to this barrier-breaking role, with her loved ones looking on, millions of Americans will see a more expansive version of the American family staring back at them - one that could broaden rigid ideas of politically palatable family dynamics or gender roles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X