వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన వాళ్లను రక్షించేందుకు.. కాల్పులకు ఎదురెళ్లి.. ఓ అమెరికా పౌరుడి సాహసం

అమెరికాలోని కాన్సాస్ లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించేందుకు ప్రయత్నించాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కాన్సాస్: అమెరికాలోని కాన్సాస్ లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించేందుకు ప్రయత్నించాడు.

దుండగుడి చేతిలోని తుపాకీని లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మది తూటాలు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన యువకుడి ఒంట్లోకి కూడా దూసుకెళ్లాయి. వాటిలో ఒకటి అతడి ఛాతీలోకి దూసుకెళ్లగా, మరొక తూటా అతడి చేతిలోకి దిగింది.

ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు

వివరాల్లోకి వెళితే... అమెరికా నౌకాదళంలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్ పురింటన్(51) ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు. 'మా దేశాన్ని విడిచి వెళ్లిపోండి..' అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు.

Kansas Shooting: The Young American Ian Grillot Who Tried To Save Hyderabad Engineer Srinivas Kuchibhotla

సరిగ్గా అదే సమయంలో అందులో బీర్ తాగేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలియట్(24) వెంటనే పురింటన్ పైకి దూకాడు. అతడి చేతిలోని తుపాకీ లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

ఈ క్రమంలో పురింటన్ ట్రిగ్గర్ నొక్కడంతో రెండు బుల్లెట్లు గ్రిలియట్ శరీరంలోకి దూసుకెళ్లాయి. అయినా సరే పట్టు విడవకుండా అతడు విరోచితంగా పోరాడి పురింటన్ ను కింద పడవేశాడు.

బుల్లెట్లు శరీరంలోకి దిగి తీవ్రంగా గాయపడిన గ్రిలియట్ స్పృహకోల్పోతుండగా.. పురింటన్ అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం ఐదు గంటల్లోనే పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేశారు.

స్పృహకోల్పోయిన గ్రిలియట్ ను ఆసుపత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాస్తవానికి ఇతడే గనుక అడ్డుకోకుంటే అలోక్ కూడా చనిపోయే పరిస్థితి ఉండేదట.

''అతడు ఎక్కడ్నించి వచ్చాడో తెలియదు. అతడి జాతి కూడా మాకు తెలియదు. కానీ మనందరం మనుషులం. ఇతరులు ఏం చేయాలో నేను సరిగ్గా అదే చేశాను. నేను బతికి బయటపడడం నిజంగా అదృష్టమే. ఇది చాలా గొప్ప విషయం. ఆ ఘటనను నేను వర్ణించలేను. అలోక్ మాదసాని నిన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అతడికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది..'' అంటూ గ్రిలియట్ ఆసుపత్రిలోని బెడ్ పై ఉండి మాట్లాడాడు.

మొత్తానికి మన వాళ్లను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నించిన ఇయాన్ గ్రిలియట్ నిజమైన హీరో!

English summary
KANSAS, US: 24-year-old American Ian Grillot is being called a hero after he tried to stop a Navy veteran from shooting at two Indian engineers in a bar in Olathe, Kansas. Mr Grillot was shot in the hand and chest and is in hospital. He is now said to be out of danger. When Adam Purinton, 51, shouted racial abuse at Hyderabad engineers Srinivas Kuchibhotla and Alok Madasani at the Austins Bar & Grill, and opened fire, Mr Grillot, out for a drink at the sports bar, intervened and tried to take the gun away from the shooter. As he shot at the Indians, Purinton yelled, "get out of my country." The local police are calling it a "possible hate crime".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X