వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్‌లో అవమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ టిసిఎ రాఘవన్‌కు పాకిస్తాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతనిని, అతని భార్యను అనుమతించలేమని కరాచీలోని ప్రముఖ సింధ్ క్లబ్ చెప్పింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పాకిస్థాన్ - భారత్ ఫ్రెండ్ షిప్ ఫోరం సింధ్ క్లబ్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం భారత్‌కు చెందినది కావడంతో రాఘవన్‌కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కరాచీ వచ్చారు. అయితే, తమ క్లబ్ లోకి రాఘవన్‌ను అనుమతించలేదు.

Karachi’s elite Sindh Club refuses to host Indian envoy

ఆయనను క్లబ్‌లోకి అనుమతించేది లేదని చివరి నిమిషంలో క్లబ్ యాజమాన్యం చెప్పింది. దీంతో, రాఘవన్ కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు వెనుదిరిగారు. ముంబైలో పాక్ గజల్ గాయకుడు గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అనుమతించనందువల్లే ప్రతీకారచర్యలో భాగంగా ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.

టిసిఎ రాఘవన్‌ను అనుమతించకపోవడానికి గల కారణాలను క్లబ్ చెప్పలేదు. దీంతో, పాకిస్తాన్ అధికారుల ఒత్తిడి వల్లో, ముంబైలో గజల్ గాయకుడు గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అనుమతించకపోవడం వల్లో ఆ క్లబ్ ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు.

పాకిస్తాన్‌లో భారత్ పైన విద్వేష ప్రచారం జరుగుతోందనేందుకు ఇది నిదర్శనమని, గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయడం పైన విద్వేషపూరితంగా అక్కడి చానెళ్లు చర్చలు నిర్వహించాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
In a development likely to further hit Indo-Pak relations, the elite Sindh Club in Karachi refused to host Indian high commissioner to Pakistan TCA Raghavan and his wife for a function on September 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X