వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ యువరాణి అర్ధనగ్న ఫొటోలు: 6గురిపై కేసు విచారణ

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: గతంలో సంచలనం సృష్టించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ అర్ధనగ్న ఫొటోల వ్యవహారంపై ఫ్రెంచ్ కోర్టు విచారణ చేపట్టింది. 2012లో ఆమెను రహస్యంగా ఫొటోలు తీయడమేగాకుండా, వాటిని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాజకుటుంబం పరువు తీశారన్న కేట్ తరపు న్యాయవాదుల వాదనకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది.

ఈ మేరకు కేట్ ఫొటోలను ప్రచురించిన క్లోజర్ మేగజైన్‌కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కేసు విచారణ జరుగనున్నట్లు ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు మంగళవారం మీడియాకు వెల్లడించాయి.

Kate Middleton topless photos trial sees six people accused of breaching strict French privacy laws

2012లో కేట్ మిడిల్టన్, భర్త ప్రిన్స్ విలియమ్సన్‌తో కలిసి హాలిడే కోసం ఫ్రాన్స్‌లో లా ఫ్రావిన్స్‌కు వెళ్లింది. అక్కడ మూడో మనిషి అడుగుపెట్టే అవకాశం లేని భవంతి పొర్టికోలో కేట్, విలియంలు చవనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజన్‌కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు.

ఆ తర్వాత మరుసటి రోజే భారీ టైటిల్‌తో కేట్ టాప్‌లెస్ ఫొటోలు కవర్ పేజీపై వేసి మేగజైన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ ఫొటో ప్రచురణలు డెన్మార్క్, ఐర్లాండ్, స్వీడన్, దాదాపు యూరప్ దేశాలన్నంటిలో విడుదల చేయడం జరిగింది. కాగా, ఈ ఘటన బ్రిటన్ రాజకుటుంబానికి ఆగ్రహం తెప్పించింది.

వెంటనే ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు పత్రికపై దావా వేసింది. కాగా, నాలుగేళ్ల విచారణలో మొత్తం ఆరుగురు నిందితులుగా తేలారు. మేగజైన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీ లాన్స్ ఫొటో జర్నలిస్టులపై వచ్చే ఏడాది నుంచి విచారణ ప్రారంభం కానుంది.

English summary
SIX people are set to face trial over topless photos of the Duchess of Cambridge published in 2012.A group of reporters, photographers and media chiefs will be tried in France for invasion of privacy, according to judicial sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X