• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్‌లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..

|

'అంటు వ్యాధులకు పుట్టినిల్లు'గా పేరు పొందడమేకాదు, తన రోగాలను అందరికీ అంటించి ప్రపంచాన్ని ఆగం చేసిన పాపం చైనాదే.. అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాంటి విమర్శకులెందరో మండిపడుతుంటారు. కరోనా విషయంలో చైనా పాపం ఇంకా తేలాల్సిఉన్నా.. అంతుచిక్కని కొత్త వైరస్ విషయంలో మాత్రం డ్రాగన్ కనీవినీ ఎరుగని వికృతానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. తద్వారా పొరుగు దేశాల్లో చుచ్చులు పెట్టడంలో ఎవరైనా తన తర్వాతే అని మరోసారి నిరూపించుకుంది.

చైనా షాకింగ్ ప్రకటన: కరోనా కంటే డేంజర్.. అంతుచిక్కని మరో వైరస్ వ్యాప్తి.. కజకిస్తాన్ లో మృత్యువిలయం

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

చైనాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకునే దేశాల్లో కజకిస్తాన్ కూడా ఒకటి. ఆ రెండు దేశాల మధ్య 1800 కిలోమీటర్ల మేర బోర్డర్ ఉంది. రాకపోకలు, వ్యాపార వాణిజ్యాలు జోరుగా సాగుతుంటాయి. కజకిస్తాన్ లో నివసిస్తోన్న చైనీయుల సంఖ్యా తక్కువేమీ ఉండదు. అయితే కజక్ రాజధాని నూర్ సుల్తాన్‌లో గల చైనీస్ ఎంబసీ కొద్ది గంటల కిందట ఓ సంచలన ప్రకటన చేసింది. కజకిస్తాన్ లో గుర్తుతెలియని కొత్త వైరస్ వీర విహారం చేస్తున్నదని, అది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైందని, ఇప్పటికే దాని బరినపడి వేల మంది చనిపోయారని తెలిపింది. దీనిపై కజకిస్తాన్ ప్రభుత్వం అనూహ్యంగా స్పందించింది.

కేసీఆర్ కు కరోనా: హైకోర్టు సంచలనం.. మాండమస్ పిటిషన్‌పై అనూహ్య స్పందన

అంతుచిక్కని న్యుమోనియా..

అంతుచిక్కని న్యుమోనియా..

ఓ వైరస్ కజకిస్తాన్ లో వేగంగా వ్యాప్తి చెందడంతో అంతుచిక్కని న్యుమోనియా బారన పడి 1772 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది కరోనా మరణాల సంఖ్య కంటే పదుల రెట్లు ఎక్కువని, కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్, ఆత్రయూ, అకుటోబె, షిమ్కెంట్ తదిర ప్రాంతాల్లో ఈ కొత్త వైరస్ ప్రభావం ఎకక్కువగా ఉందని, జనం అప్రమత్తంగా ఉండాలని చైనీస్ ఎంబసీ ప్రకటన చేసింది. కజకిస్తాన్ లో కొత్త వైరస్ కారణంగా చనిపోతున్నవాళ్లలో చైనీయులు కూడా ఎక్కువ ఉన్న కారణంగానే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అసలే కరోనా కాలం కావడంతో చైనా ‘కొత్త వైరస్' ప్రకటన ప్రపంచ దేశాలను మరింత భయంలోకి నెట్టేసింది. చివరికి..

చైనా ఫేక్ రిపోర్ట్..

చైనా ఫేక్ రిపోర్ట్..

అంతుచిక్కని న్యుమోనియ కారణంగా కజకిస్తాన్ లో గడిచిన ఆరు నెలల్లో 1772 మంది చనిపోయారని, ఒక్క జూన్ లోనే 628 మంది మృత్యువాత పడ్డారంటూ చైనీస్ ఎంబసీ చేసినలో ఇంచు కూడా నిజం లేదని కజకిస్తాన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, చైనీస్ ఎంబసీ చెప్పిన విషయాల ఆధారంగా చైనీస్ మీడియా రాసిన వార్తలన్నీ ఫేక్ రిపోర్టులని మండిపడింది. నిజానికి చైనీస్ ఎంబసీ ప్రకటన తర్వాత కజకిస్తాన్ మీడియా సైతం కొత్త వైరస్ వార్తలు ప్రసారం చేయడంతో ఇది నిజమేనని అంతా నమ్మారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించడంతో అనుమానాలు తీరినట్లయింది.

  ఘోర ప్రమాదం.. 52 మంది దుర్మరణం..!
  ‘అంతుచిక్కని వైరస్’ లేదు..

  ‘అంతుచిక్కని వైరస్’ లేదు..

  చైనీస్ ఎంబసీ ప్రకటనలో పేర్కొన్న ‘అంతుచిక్కని న్యుమోనియా'పై కజకిస్తాన్ ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలను అనుసరించి, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ న్యుమోనియా ఇన్ఫెక్షన్ కేసులను ఎప్పటికప్పుడు ట్యాలీ చేసుకుంటుననామని, చైనా అధికారులు, చైనీస్ మీడియా చెప్పినట్లు అంతుచిక్కని న్యుమోనియా అయితే ప్రస్తుతానికి లేదని వివరించారు. అయితే, ఫేక్ రిపోర్టుల ద్వారా ప్రజల్ని భయపెట్టిన చైనాపై చర్యలు లేదా ఆంక్షలు విధించే అంశంపై కజకిస్తాన్ అధికారులు స్పందించలేదు.

  English summary
  Kazakhstan dismissed as incorrect on Friday a warning by China's embassy for its citizens to guard against an outbreak of pneumonia in the central Asian nation that it described as being more lethal than the coronavirus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more