వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్‌లో ముగ్గురు ఇండియన్లకు చోటు!

|
Google Oneindia TeluguNews

కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసాద్ పండా, లీలా అహీర్‌తో పాటు రాజన్ సాహ్నే కెనడా కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

విమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానంవిమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానం

ఇన్‌ఫ్రా మినిస్టర్‌గా ప్రసాద్

ఇన్‌ఫ్రా మినిస్టర్‌గా ప్రసాద్

కెనడా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ప్రసాద్ పండా స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి. కాల్గరి - ఎడ్జ్‌మెంట్ నియోజకవర్గం నుంచి ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కెనడాలో ఇటీవలి కాలంలో కన్జర్వేటివ్ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో వైల్డ్ రోజ్ పార్టీ నుంచి గెలిచిన ఆయన.. ఈసారి యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆయన చేసిన రాజకీయ కృషికిగానూ కెనడా ప్రభుత్వం కీలకమైన ఇన్‌ఫ్రాస్టక్చర్ మంత్రిగా అవకాశమిచ్చారు.

లీలా అహీర్‌కు సాంస్కృతిక శాఖ

లీలా అహీర్‌కు సాంస్కృతిక శాఖ

విజయనగరం జిల్లాకు చెందిన లీలా అహీర్ ఎడ్‌మోంటన్ - చెస్టర్‌మేర్ నియోజకవర్గం నుంచి కెనడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమెకు సాంస్కృతిక, మహిళా సంక్షేమ శాఖ అప్పగించారు. పంజాబీని వివాహమాడిన లీలా విజయనగరంలో ఉండే తండ్రిని చూసేందుకు అప్పుడప్పుడూ వస్తుంటారు.

కమ్యూనిటీ, సోషల్ సర్వీస్ మంత్రిగా రాజన్ సాహ్నే

కమ్యూనిటీ, సోషల్ సర్వీస్ మంత్రిగా రాజన్ సాహ్నే

భారత సంతతికి చెందిన రాజన్ సాహ్నే సైతం కెనడా ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. కేబినెట్‌లో కమ్యూనిటీ అండ్ సోషల్ సర్వీసెస్ శాఖకు ఆమెకు అప్పగించారు. కాల్గరీ నార్త్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజన్ నలుగురు పిల్లల తల్లి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆమె.. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో పనిచేశారు. కాల్గరీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ డిగ్రీతో పాటు ఎంబీఏ పట్టా పొందారు.

English summary
Jason Kenney on Tuesday appointed three indians to cabinet. Leela Aheer, Minister of Culture, Multiculturalism and Status of Women, Rajan Sawhney was appointed as Alberta’s Minister of Community and Social Services and Prasad Panda, as Minister of Infrastructure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X