వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ఫ్లోర్ ప్రారంభించిన కేరళ సీఎం...మసాలా బాండ్లు విక్రయం

|
Google Oneindia TeluguNews

లండన్ : లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడింగ్ కోసం తొలిసారిగా ఒక ఫ్లోర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లోర్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభించారు. అంతేకాదు కేరళ రాష్ట్రం ట్రేడ్ చేస్తున్న కేరళ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ చేశారు. ఈ బాండ్ల ట్రేడింగ్‌కు కూడా పినరాయి విజయన్ హాజరయ్యారు. ఇలా ఒక ఫ్లోరును భారతదేశానికి చెందిన ముఖ్యమంత్రి ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు జారీ చేసిన మసాలా బాండ్లను లండన్ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడింగ్‌కు ఉంచారు. అయితే ఈ బాండ్లు భారత కరెన్సీలో అమ్ముడుపోతాయి. దాదాపు రూ.2150 కోట్లు విలువ చేసే మసాలా బాండ్లు కనుక అమ్ముడుపోతే కేరళలో వరదల ధాటికి నష్టపోయిన ప్రాంతాల మరమత్తులకు వినియోగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సెక్యూరిటీ మార్కెట్లలో మసాలా బాండ్లు లిస్ట్ అయి ఉన్నాయి.

Kerala CM Pinarayi Vijayan opens floor in London Stock Exchange, trades Masala bonds

ఇక మసాలా బాండ్ల విక్రయాల ద్వారా వచ్చే డబ్బును కేరళ మరమత్తుల కోసం వినియోగించాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్‌ది. ఆయన కూడా లండన్‌లో ఫ్లోర్ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సీఎం పినరాయి విజయన్‌తో పాటు థామస్ కూడా ఉన్నారు. అంతకుముందు మసాలా బాండ్‌ను లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు లిస్టు కావడంపై హర్షం వ్యక్తం చేశారు యూకే ప్రైమరీ మార్కెట్స్ హెడ్ డార్కో హజుకోవిక్ తెలిపారు.

ఇదిలా ఉంటే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నాలుగు యూరోపియన్ దేశాల్లో 13 రోజుల పాటు పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగానే పినరాయి విజయన్ వరల్డ్ రీ కన్స్‌ట్రక్షన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ప్రసంగించారు. ఇది జెనీవాలోని ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్‌లో జరిగింది. ఈ సదస్సులో 2018 కేరళ వరదల గురించి సీఎం పినరాయి విజయన్ మాట్లాడారు. ఇక కేఎస్ఎఫ్ఈ ప్రవాసీ చిట్టీని కూడా ఆయన ప్రారంభించనున్నారు. అదే సమయంలో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అవనున్నారు.

English summary
In a first for an Indian chief minister, Pinarayi Vijayan on Friday opened the floor for trading at the prestigious London Stock Exchange (LSE) and attended the listing ceremony of a masala bond from Kerala Infrastructure Investment Fund Board (KIIFB). Masala bonds are essentially offshore bonds that are denominated in Indian rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X