వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కుల మనుగడకే ప్రమాదం: అమెరికాలో రోడ్డెక్కిన ఖలిస్తాన్: రాయబార కార్యాలయం ముట్టడి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రోడ్డెక్కారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. రాయబార కార్యలయం వద్ద ఆందోళనలను నిర్వహించారు. ప్లకార్డులు, ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్దా నిరసనలను చేపట్టారు.

Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలుRed Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు

మన్‌హట్టన్‌, చికాగో, న్యూయార్క్, సిటీ, ఫిలడెల్ఫియా వంటి ప్రాంతాల్లోనివసిస్తోన్న సిక్కు సామాజిక వర్గానికి చెందిన రైతులు భారీ సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించడంతో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనలు చేపట్టిన సమయంలో అధికారులు, ఉద్యోగులెవరూ భారత రాయబార కార్యాలయంలో లేరు. సుమారు అయిదు గంటల పాటు ఆందోళనకారులు రాయబార కార్యాలయం వద్దే తమ నిరసనలను కొనసాగించారు. మైక్‌ల ద్వారా స్లోగన్లను వినిపించారు.

Khalistan supporters held a protest outside the Indian embassy in Washington DC

తాము రైతులమని, ఉగ్రవాదులు కాదంటూ నినదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొండి వైఖరిని విడనాడాలని, రైతాంగానికి వ్యతిరేకంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలంటూ ఖలిస్తాన్ ప్రతినిధి, చికాగోకు చెందిన పర్మీందర్ సింగ్ డిమాండ్ చేశారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలకు చెందిన సిక్కు సామాజిక వర్గ రైతాంగానికి ఈ మూడు వ్యవసాయ బిల్లులు శాపంలా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Khalistan supporters held a protest outside the Indian embassy in Washington DC

సిక్కుల మనుగడనే ప్రశ్నించేలా మూడు వ్యవసాయ బిల్లుల వల్ల సిక్కు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఖలిస్తాన్ ఫిలడెల్ఫియా యూనిట్ అధ్యక్షుడు బక్షీసింగ్ సంధు ఆరోపించారు. కేంద్రం తీసుకుంటోన్న నిర్ణయాలు సిక్కు సామాజిక వర్గం మనుగడకే ప్రమాదకరంలా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ బిల్లులను భారత ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసేంత వరకూ ఉద్యమిస్తామని అన్నారు.

Recommended Video

Farmers Tractor Rally: Protesters Enter Delhi's Red Fort, Wave Their Flags From The Ramparts

English summary
Khalistan supporters held a protest outside the Indian embassy in Washington DC in support of protest against farm laws in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X