వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టరీ:కింగ్ నామ్ హత్యకు కారకులు ఎవరు?నేరం రుజువైతే మరణశిక్షే

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై పోలీసులు హత్యాభియోగాలను మోపనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మలేషియా:ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై మలేషియా పోలీసులు హత్యాభియోగాలు మోపనున్నారు.ఈ విషయంలో నేరారోపణ రుజువైతే ఇద్దరు మహిళలకు పోలీసులు మరణశిక్ష విధించే అవకాశం ఉంది.

విచారణ పూర్తి చేసి వారు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష అమలు చేయనున్నారు. మలేషియా అటార్నీ జనరల్ మహ్మద్ అపాంది అలీ చెప్పారు.

నామ్ హత్యకు సంబందించి తదుపరి జరుగనున్న పరిణామాలను ఆయన చెప్పారు. ఇండోనేషియాకు చెందిన సితి ఐసియూ వియత్నాంకు చెందిన డోవాన్ థి హువాంగ్ అనే ఇద్దరు మహిళలపై హత్యాభియోగాలు నమోదు కానున్నాయి.

Kim Jong nam: North Korean team seeks body as women face charges

ఈ కేసులో వారు దోషులుగా తేలితే మరణ శిక్ష ఉంటుందని తెలిపారు. అదొక సరదా కార్యక్రమమని బావించి ఇందులో నటించేందుకు అనుకొని తాను 90 డాలర్లు తీసుకొని అవతలి వ్యక్తి చెప్పినట్టు చేసినట్టుగా సితీ ఐసియూ చెప్తుండగా మలేషియా పోలీసులు మాత్రం వారిద్దరూ ఏం చేస్తున్నారనే విషయం వారికి ముందే తెలుసునని చెప్పారు.

మరో ఇద్దరిని కూడ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా వారిలో ఓకరు ఇపప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. మరో ఉత్తర కొరియా వ్యక్తిని మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ ఉత్తర కొరియాకు సంబందించిన వ్యక్తిపై ఆరోపణలు నమోదు చేయాల్సి వస్తే అతడి విషయంలో కూడ చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని తెలిపారు.మరో ఏడుగురు ఉత్తర కొరియాకు చెందిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో నలుగురు ఇప్పటికే తమ దేశం విడిచిపోయారని పోలీసులు తెలిపారు.

English summary
A high-level North Korean delegation has arrived in Kuala Lumpur as Malaysia announced it will charge an Indonesian and a Vietnamese woman with the murder of Kim Jong-nam, the exiled half-brother of North Korea’s leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X