• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోదరుడిని ఇందుకే కిమ్ జాంగ్ ఉన్ హత్యచేయించాడా..? వెలుగులోకి సంచలన విషయాలు

|

2017లో హత్యకు గురైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సవితి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికాతో పనిచేసినట్లు సమాచారం. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి నామ్ సమాచారం చేరవేసేవాడని కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ట్రంప్ స్పందించారు. కిమ్ జాంగ్ నామ్ ఉత్తరకొరియా అధ్యక్షుడికి సోదరుడు అని తెలిసి ఉంటే అతన్ని నియమించుకునే వారం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

జగన్‌కు ఎంఎస్ సహకారం: రైతుకు రూ.50 వేల ప్రయోజనం, ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారం

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో నామ్‌కు సత్సంబంధాలు

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో నామ్‌కు సత్సంబంధాలు

చైనాతో పలుమార్లు భేటీ అయిన సందర్భంలో కిమ్ జాంగ్ ఉన్ తన సవితి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో పనిచేస్తున్నాడని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. సీఐఏ ఆపరేటివ్‌గా ఉండేవాడని కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. హత్యకు గురైన కిమ్ జాంగ్ నామ్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కంటే వయసులో పెద్దవాడు. అదే సమయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ఉండేవాడు. కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షకుడిగా అవుతున్నాడన్న సమాచారం తెలిసి అప్పటి నుంచి నామ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మకావ్‌లో ఆయన బస చేశారు. తనకు చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆర్థిక సహకారం అందించినట్లు సమాచారం.

రిస్క్ అని తెలిసికూడా మలేషియాకు పయనం

రిస్క్ అని తెలిసికూడా మలేషియాకు పయనం

ఇక 2017లో డబ్బులు అవసరం ఉన్నందున రిస్క్ అని తెలిసి కూడా మలేసియాకు వెళ్లారు. ఇక అమెరికా చైనా ఇంటెలిజెన్స్ సంస్థలకు రక్షణ ఇవ్వడం చాలా కష్టంగా మారింది. రిస్క్ అని తెలిసి కూడా మలేషియాకు నామ్ వెళ్లారు. కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో ఇద్దరు మహిళలు నామ్‌పై విషప్రయోగం చేసి హత్య చేశారు. అతనితోపాటు తెచ్చుకున్న బ్యాగ్‌లో 124000 డాలర్లు ఉన్నట్లు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కనుగొన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు నిరాకరించాయి. ఇదిలా ఉంటే ఆయన మృతికి ముందు నామ్ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో పలుమార్లు భేటీ అయినట్లు జపాన్ పత్రిక అసాహీ కథనాలు ప్రచురించింది. సీఐఏ వారిని నామ్ సింగపూర్ లేదా మలేషియాలో కలిసేవారని పత్రికలో రాసుకొచ్చింది.

 దెబ్బతిన్న అమెరికా ఉత్తరకొరియా సంబంధాలు

దెబ్బతిన్న అమెరికా ఉత్తరకొరియా సంబంధాలు

ఓవైపు కిమ్ జాంగ్ ఉన్ తన మిత్రుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు నెరిపాడన్న కారణంతో అతని సోదరుడిని అంతమొందించేందుకు ఉన్ ఆదేశాలివ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక వియత్నాంలో అమెరికా ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు విఫలమవడంతో పరిస్థితులు మరింత అద్వానంగా తయారయ్యాయి. మరోవైపు 2017 తర్వాత మళ్లీ ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను పరీక్షించింది. ఇక మరో ప్రముఖ వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్‌కు మామ అయిన జాంగ్ సాంగ్ తాహెక్‌ను కూడా అంతమొందించాల్సిందిగా ఉన్ ఆదేశాలు ఇచ్చి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశాయి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kim Jong Nam, the half brother of North Korean president was assasinated in 2017 at Malaysia airport. A report said that Nam's assassination orders were given by Kim as his half brother Nam was maintaining a close relations with US intelligence agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more