వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ను చీల్చిచెండాడిన కిమ్, తొలిసారిగా ఇంగ్లీష్ లో ప్రసంగం, తిక్కకుదురుస్తా అంటూ హెచ్చరిక!

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి రెచ్చిపోయాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తెగ తిట్టిపారేశారు. ‘ట్రంప్ తిక్క కుదురుస్తా..’ అని వార్నింగ్ ఇచ్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి రెచ్చిపోయాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తెగ తిట్టిపారేశారు. 'ట్రంప్ తిక్క కుదురుస్తా..' అని వార్నింగ్ ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కిమ్ తీవ్రంగా తప్పుపట్టారు. డోనాల్డ్ ట్రంప్‌కు పట్టిన పిచ్చిని వదిలిస్తానని కిమ్ అన్నారు. తమ దేశానికి అణ్వాయుధాలు అభివృద్ధి చేసే హక్కు ఉందన్నారు.

ట్రంప్ ఏమన్నారంటే...

ట్రంప్ ఏమన్నారంటే...

ఉత్తరకొరియా ఇటీవల పదేపదే క్షిపణి ప్రయోగాలు, అణుపరీక్షలతో టెన్షన్ పుట్టిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అమెరికా నేలను టార్గెట్ చేసే విధంగా కూడా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. దీంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఉత్తర కొరియాను నాశనం చేస్తానన్నారు. ‘రాకెట్ మ్యాన్ కిమ్ ఓ సూసైడ్ మిషన్ మీద ఉన్నాడు..' అంటూ ట్రంప్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కిమ్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు.

అరుదైన రీతిలో కిమ్ వ్యక్తిగత ప్రకటన...

అరుదైన రీతిలో కిమ్ వ్యక్తిగత ప్రకటన...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో చాలా అరుదైన రీతిలో కిమ్ ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ శుక్రవారం వ్యక్తిగత ప్రకటన చేశారు. జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన హెచ్చరించారు.

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...

ఉత్తరకొరియాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిగా శుక్రవారం తొలిసారి ఇంగ్లీష్‌లో మాట్లాడిన కిమ్..
ప్రపంచ దేశాల ముందు ఉత్తరకొరియాను ట్రంప్ అవమానించారని, తమపై యుద్ధం చేసి నాశనం చేస్తానని అన్నారని, ఆ పిచ్చి మాటలకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు.

ఆయన మాటలు నన్ను భయపెట్టలేవు.. ఆపలేవు..

ఆయన మాటలు నన్ను భయపెట్టలేవు.. ఆపలేవు..

అమెరికా దేశాధినేతపై ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ మాటలు నన్ను కన్విన్స్ చేస్తున్నాయి, ఆయన మాటలు నన్నేమీ భయపెట్టలేదు.. కనీసం నన్ను ఆపలేవు..'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ట్రంప్ మాటలు నేను ఎన్నుకున్న మార్గం కరెక్ట్ అని గుర్తు చేశాయి, ఆ మార్గాన్నే నేను చివర వరకు అనుసరిస్తాను అని కిమ్ పేర్కొన్నారు.

సుప్రీమ్ కమాండర్ గా పనికిరాడు...

సుప్రీమ్ కమాండర్ గా పనికిరాడు...

అంతేకాదు, ఉత్తరకొరియా అధినేత కిమ్ తన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడిని దునుమాడారు. ‘‘ట్రంప్ ఓ రోగ్.. ఓ గ్యాంగ్‌స్టర్.. అతను రాజకీయవేత్త కానే కాదు అని కిమ్ వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందర్నీ బెదిరిస్తున్నాడని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, సుప్రీమ్ కమాండర్‌గా పనికిరాడు..'' అని ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కిమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులతోనే ఆ ముసలి ట్రంప్ తిక్క కుదురుస్తానని కిమ్ హెచ్చరించారు.

English summary
North Korean leader Kim Jong-un has called US President Donald Trump "mentally deranged" and said he will "pay dearly" for the recent threats against his country.In a rare statement directly attributed to the North's leader, Kim said on Friday that Trump is "unfit to hold the prerogative of supreme command of a country", describing the president as "a rogue and a gangster fond of playing with fire". Hours later, North Korea's foreign minister reportedly said his country may be planning to test a hydrogen bomb in the Pacific Ocean to fulfill Kim's vow to take the "highest-level" action against the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X