వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్​ కిరాతకం: కరోనా భయంతో జనాల్ని లేపేశాడు - సీక్రెట్ లాక్​డౌన్ -ఉత్తరకొరియాలో కలకలం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్​ కేసులు పెరిగిపోతున్న వేళ.. కట్టడి కోసం రకరకాల చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని దేశాలు అయితే మళ్లీ లాక్​డౌన్​ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. అయితే తన దేశంలో జరిగే విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడే నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్ మాత్రం ఉన్మాద నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Kim Jong Un : North Koreaలో సీక్రెట్ Lockdown.. ఆంక్షల్ని ఉల్లంఘించిన ఇద్దరికి మరణశిక్ష!

సీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్సీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్

ఉ.కొరియాలో కరోనా కల్లోలం

ఉ.కొరియాలో కరోనా కల్లోలం


మిగతా దేశాల్లాగే కరోనా వల్ల ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మెడికల్ సప్లయ్​ లేక చాలా ఇబ్బంది పడింది. వీటికి తోడు జూన్​లో పొరుగు దేశం చైనా సరిహద్దుని మూసేయడం​, ప్రకృతి విపత్తుల వల్ల డ్యామేజ్​ ఇంకా ఎక్కువే జరిగింది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కిమ్​ జోంగ్​ ఉన్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ఒక రిపోర్ట్​ బయటపెట్టింది. అంతేకాదు కరోనా వ్యాక్సిన్​ తయారుచేస్తున్న ఓ సౌత్​కొరియన్​ ఫార్మాసూటికల్ కంపెనీ వెబ్​ సైట్​ను ఉత్తర కొరియా హ్యాక్​ చేసే ప్రయత్నం చేసి.. విఫలమైనట్లు వెల్లడించింది.

వాళ్లకు ఉరి తప్పదు

వాళ్లకు ఉరి తప్పదు

ఇప్పటిదాకా తమ భూభాగంలో ఒక్క కరోనా కేసు రికార్డు కాలేదని ఉత్తరకొరియా ప్రకటించుకుంది. కానీ, రహస్యంగా చాలాచోట్ల ఆంక్షలు కొనసాగుతున్నట్లు సౌత్ కొరియా ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. రాజధాని ప్యోంగ్యాంగ్​తో పాటు ఉత్తర జంగ్​గ్యాంగ్​లో లాక్​డౌన్​ని కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నెల మొదట్లో చాలా ప్రాంతాల్లో లాక్​డౌన్​ అమలుచేసి.. ఎత్తేసినట్లు సమాచారం. మరోవైపు ఆంక్షల్ని ఉల్లంఘించిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు తెలుస్తోంది..

కరోనా సోకుతుందని..

కరోనా సోకుతుందని..


ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి కారకుడయ్యానే కారణంతో ఓ అధికారిని, విదేశాల నుంచి గూడ్స్​ తెప్పించుకున్న మరో అధికారిని కిమ్​ ఉరి తీయించాడు. వాళ్ల వల్ల కరోనా వ్యాపిస్తుందేమో అనే అనుమానంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సముద్ర నీటి వల్ల వైరస్​ వస్తుందన్న భయంతో చేపల వేట, ఉప్పు తయారీపై నిషేధం విధించారు. ఉన్నతాధికారుల సమావేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంపై ఆగ్రహం వెల్లగక్కిన కిమ్​.. తక్షణమే దానిని గాడిన పెట్టాలని అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం.

రెచ్చగొట్టొద్దని కిమ్ వార్నింగ్

రెచ్చగొట్టొద్దని కిమ్ వార్నింగ్

మొదట్లో ట్రంప్​ను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించిన కిమ్​.. ఆ తర్వాత స్నేహ హస్తానికి చెయ్యి చాచాడు. ఆ చర్చలు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈలోపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి పాలయ్యాడు. అయితే జో బైడెన్​ విక్టరీపై ఉత్తర కొరియా మౌనంగా ఉంది. బైడెన్​ కొత్త విధానాలపై ఒక క్లారిటీ లేని నేపథ్యంలో అమెరికాను రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని ఉత్తర కొరియా ప్రభుత్వం విదేశాలలో ఉన్న దౌత్యవేత్తల్ని ఆదేశించింది. మరి బైడెన్​ దృష్టిలో పడేలా మిస్సైల్ టెస్టులు చేయిస్తాడా? లేదంటే కిమ్​ నేరుగా స్నేహానికి చెయ్యి చాస్తాడా? అనేది వేచిచూడాలి.

పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

English summary
North Korean leader Kim Jong Un has ordered at least two people executed, banned fishing at sea and locked down the capital, Pyongyang, as part of frantic efforts to guard against the coronavirus and its economic damage, South Korea’s spy agency told lawmakers Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X