వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నెర చేసిన కిమ్... ఆరుగురికి బహిరంగ మరణ శిక్ష... వ్యభిచార దందాలో సొంత పార్టీ నేతలు..

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్యోంగ్‌యాంగ్ నగరంలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ ఉదంతంపై కన్నెర్ర చేశాడు. దాని సూత్రధారులైన ఆరుగురు నిందితులను రాజధాని నగరంలో బహిరంగంగా కాల్చి చంపించాడు. ఆ ఆరుగురు నిందితుల్లో నలుగురు కిమ్‌ సారథ్యం వహిస్తున్న 'వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా'కు చెందినవారే కావడం గమనార్హం.జులై 20న ఈ ఘటన జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి.

20 ఏళ్ల లోపు కాలేజీ అమ్మాయిలే...

20 ఏళ్ల లోపు కాలేజీ అమ్మాయిలే...

సెక్స్ రాకెట్‌లో పట్టుబడిన అమ్మాయిలంతా ప్యోంగ్‌యాంగ్ నగరంలోని పలు కాలేజీల్లో చదువుతున్నవారే. వీరంతా తమ ఖర్చుల కోసం ఇలా వ్యభిచారంలోకి దిగుతున్నారు. ఇందులో 20 ఏళ్ల లోపు వయసున్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ నెలా వీరు 500 డాలర్ల వరకు సంపాదిస్తున్నారు.వర్కర్స్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారులు సైతం చాన్నాళ్లుగా ఈ సెక్స్ రాకెట్‌లో భాగమైనట్లు ఇటీవల కిమ్ జోంగ్ దృష్టికి వచ్చింది. కాలేజీ అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది.

నేరుగా కిమ్ నుంచే ఆదేశాలు...

నేరుగా కిమ్ నుంచే ఆదేశాలు...

మొదట అమ్మాయిలకు డబ్బు ఆశజూపి... ఆ తర్వాత వారిని బలవంతంగా సెక్స్ ట్రేడ్‌లోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగమైనవారందరినీ ఇటీవల అరెస్ట్ చేశారు. కీలక నిందితులను కాల్చి పారేయమని నేరుగా కిమ్ జోంగ్ ఉన్ నుంచే ఆదేశాలు రావడంతో పోలీసులు వారిని బహిరంగంగానే కాల్చి చంపారు. నిజానికి వ్యభిచారంలో పట్టుబడితే 1-5 ఏళ్ల పాటు లేబర్ క్యాంపులో నిర్బంధిస్తారు. అయితే వ్యభిచారంపై ఉక్కు పాదం మోపేందుకే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అందుకే కిమ్ కన్నెర్ర...

అందుకే కిమ్ కన్నెర్ర...

ప్యోంగ్‌యాంగ్‌ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ యూనివర్సిటీ,ప్యోంగ్‌యాంగ్ డ్రామాటిక్&ఫిలిం యూనివర్సిటీలకు చెందిన విద్యార్థినులను ఈ సెక్స్ రాకెట్‌ కోసం ట్రాప్ చేసినట్లు గుర్తించారు. అక్కడి హై-ఎండ్ పబ్లిక్ బాత్స్‌లో ఈ వ్యభిచార దందాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సెక్స్ రాకెట్ వెనుక అధికార పార్టీ నేతలతో పాటు పలువురు సినీ స్టార్స్ కూడా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. తాను అమితంగా ఇష్టపడే యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులే సెక్స్ రాకెట్‌లో భాగమవడం కిమ్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Kim Jong Un Visits Flood Damaged Village | ఐదేండ్ల తర్వాత అక్కడికి నియంత నేత!! || Oneindia Telugu
బహిరంగ మరణ శిక్షలు కామన్...

బహిరంగ మరణ శిక్షలు కామన్...

నిజానికి ప్యోంగ్‌యాంగ్‌లో వ్యభిచార ఘటనలు వెలుగుచూడటం కొత్తేమీ కాదు. నిందితులను లేబర్ క్యాంపుకు పంపించడం తప్ప అంతకుమించిన శిక్షలేమీ విధించలేదు. కానీ ఆ శిక్షలు సరిపోవట్లేదని భావించిన కిమ్... ఇలా బహిరంగ మరణ శిక్షలు అమలుచేస్తున్నాడన్న ప్రచారం ఉంది. ఉత్తర కొరియాలో బహిరంగ మరణ శిక్షలు కూడా చాలా కామన్.శిక్షల అమలు సమయంలో వేలాది మంది వాటిని చూసేందుకు వస్తుంటారు.

English summary
All were shot dead in the Hermit State capital Pyongyang on July 20 after being charged with pimping or buying sex at a public bathhouse popular among the city’s influential residents. The women involved were all students at the city’s performing arts colleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X