వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుక్కలనూ వదలని కిమ్ జోంగ్... సంచలన ఆదేశాలు.... అదే కారణమా...

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ ప్రజలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కిమ్ ఆదేశాలతో రాజధాని ప్యోంగ్‌యాంగ్ నగరంలో అధికారులు ఇంటింటికి తిరుగుతూ కుక్కల వేటలో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఉన్నట్టుండి కిమ్ జోంగ్ కుక్కల మీద ఎందుకు పడ్డట్టు అన్నది చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

North Korea : కుక్క మాంసం తిందాం..పెంపుడు కుక్కల్ని అప్పగించాలంటూ Kim ఆదేశం!
పెంపుడు కుక్కలపై కిమ్ ఇచ్చిన ఆదేశాలు...

పెంపుడు కుక్కలపై కిమ్ ఇచ్చిన ఆదేశాలు...

గత జులై నెలలో కిమ్ జోంగ్ ఉన్ ఈ ఆదేశాలిచ్చాడు. కుక్కలను పెంచుకోవడం పాశ్చాత్య ఆధిపత్య సంస్కృతికి ఒక సింబల్ అని,అది ఒక దిగజారుడుతనమని ఉత్తర కొరియా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. బూర్జువా భావజాలాన్ని విడనాడాలని అంటున్నాయి. సాధారణ ప్రజలు పందులు,ఇతర పశువులను పెంచుకుంటారని... కానీ సంపన్నులు,ఉన్నత వర్గాలకు చెందినవారే ఇలా కుక్కలను పెంచుకుంటున్నారని అక్కడి అధికారిక వర్గాలు అంటున్నాయి. ఇలా కుక్కలను పెంచడం పట్ల కింది స్థాయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉందని అంటున్నాయి.

రెస్టారెంట్లకు అమ్మకం...

రెస్టారెంట్లకు అమ్మకం...

కిమ్ ఆదేశాలతో అక్కడి అధికారులు ప్యోంగ్‌యాంగ్ నగరంలోని సంపన్నుల ఇళ్లపై పడ్డారు. ఇంటి యజమానులు ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా బలవంతంగా పెంపుడు శునకాలను లాక్కెళ్తున్నారు. ఉత్తర కొరియాలో ఏర్పడ్డ ఆహార కొరత కారణంగానే కిమ్ ఈ ఆదేశాలిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సంపన్నుల ఇళ్ల నుంచి తీసుకొస్తున్న కుక్కలను కొన్నింటిని రెస్టారెంట్లకు విక్రయిస్తుండగా... మరికొన్నింటిని జూకి తరలిస్తున్నారు. కుక్కలను బలవంతంగా లాక్కెళ్తున్నందుకు అక్కడి ఇంటి యజమానులు కిమ్‌కు శాపనార్థాలు పెడుతున్నారు.

అదే కారణమా..?

అదే కారణమా..?

చైనా లాగే కొరియాలోనూ కుక్క మాంసానికి డిమాండ్ ఉంది. అయితే కొరియాలో మాంస కొరత ఏర్పడినందువల్లే కిమ్ పెంపుడు కుక్కలపై పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఎక్కువగా సంపన్నులే నివసిస్తుంటారు. పేదలకు ఆ నగరంలోకి ప్రవేశం లేదు. ఒక్క ప్యోంగ్‌యాంగ్ నగరానికి తప్ప గ్రామాలకు విద్యుత్ సప్లై ఉండదు. సరైన నాయకత్వం లేని కారణంగా ఎన్నో ఏళ్లుగా ఆ దేశం ఆహార కొరత,పేదరికం,ఇతరత్రా సమస్యలతో బాధపడుతోంది. అవేవీ అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడకుండా ఉండేందుకు ఉత్తర కొరియాను కిమ్ 'మిస్టరీ దేశం'గా మార్చేశారన్న వాదన ఉన్నది. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు.... అన్ని రకాల కమ్యూనికేషన్స్‌పై కిమ్ ఆంక్షలు విధించారు. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లినా... అక్కడి అధికారుల నీడలో,అనుమతించిన ప్రదేశాల్లోనే తిరగాలి తప్ప... ఇష్టారాజ్యంగా తిరిగేందుకు అనుమతి ఉండదు.

8 నెలల తర్వాత కిమ్ సమావేశం...

8 నెలల తర్వాత కిమ్ సమావేశం...

ఉత్తర కొరియాకు సంబంధించి మరో వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 8 నెలల తర్వాత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న బుధవారం(అగస్టు 19) అధికార పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఏ అంశంపై చర్చించబోతున్నారన్నది సస్పెన్స్‌గానే ఉన్నది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించడం,వరదల కారణంగా పంటలు నష్టపోవడం వంటి సమస్యలు వెంటాడుతుండటంతో... వాటిపై చర్చించే అవకాశం ఉందని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.

English summary
North Korean dictator Kim Jong Un has ordered pet dogs to be confiscated in the country’s capital, saying the pooches represent Western “decadence’’ — but their owners fear Fido is really headed for someone’s dinner table
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X