వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసక్తికరం: ఓటమిని సహించడు, కోపమెక్కువ: కిమ్ స్నేహితులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కిమ్ జంగ్ ఉన్ ఓటమిని సహించడు.. ఆసక్తికర విషయాలు..!

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. వరుసగా అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా పేరును ప్రపంచదేశాల్లో మార్మోగేలా చేస్తున్నాడు. కిమ్ స్కూల్ లో చదువుకొనే సమయంలో పాక్ యున్ అంటూ స్నేహితులు ఆట పట్టించేవారు. కిమ్ తో పాటు చదవుకొన్న కొందరు స్నేహితులు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కిమ్ గురించి వివరించారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో కిమ్ ప్రపంచానికి చుక్కలు చూపుతున్నాడు. అయితే అదే సమయంలో అమెరికాతో పాటు అణ్వాయుధాల విషయంలో పోటీ పడుతున్నాడు.

అణ్వాయుధాల శక్తిని పెంపొందించుకొనేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు కిమ్ జంగ్ ఉన్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్టు కూడ కిమ్ ప్రకటించడం శుభ పరిణామం. స్కూల్ లో చదువుకొనే సమయంలో కిమ్ ఎలా ఉండేవాడనే విషయమై ఆయన స్నేహితులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కిమ్ ను స్కూల్లో పాక్ యున్‌గా పిలిచేవారు

కిమ్ ను స్కూల్లో పాక్ యున్‌గా పిలిచేవారు

స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ ప్రాంతంలో ఉన్న జర్మన్‌ స్పీకింగ్‌ పాఠశాలలో కిమ్‌ చదువుకున్నారు.అయితే చిన్నప్పుడు కిమ్‌ను ఆయన స్నేహితులంతా పాక్ యున్ అంటూ సరదాగా ఆట పట్టించేవారు. ఈ మేరకు కొందరు స్నేహితులు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

కిమ్‌కు షాక్: కొరియా వైపు అమెరికా బలగాలు, భద్రత కోసమేనా? కిమ్‌కు షాక్: కొరియా వైపు అమెరికా బలగాలు, భద్రత కోసమేనా?

బాస్కెట్‌బాల్ అంటే కిమ్‌కు ప్రాణం

బాస్కెట్‌బాల్ అంటే కిమ్‌కు ప్రాణం

బాస్కెట్‌ బాల్‌ అంటే ప్రాణమని స్నేహితులు చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా కిమ్ ఈ ఆటను ఆడేవారని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. అయితే కిమ్ కేవలం 5 అడుగుల ఆరు అంగుళాలు మాత్రమే. తన ఎత్తును లెక్క చేయకుండా తనకు ఇష్టమైన ఆట ఆడేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు.

ట్రంప్ ఆసక్తికరం: కిమ్‌తో ఫోన్‌లో చర్చలకు నేను రెఢీ, ఎలాంటి షరతులొద్దు ట్రంప్ ఆసక్తికరం: కిమ్‌తో ఫోన్‌లో చర్చలకు నేను రెఢీ, ఎలాంటి షరతులొద్దు

స్నేహితులతో సరదాగా ఉండేవాడు

స్నేహితులతో సరదాగా ఉండేవాడు

కిమ్ జంగ్ ఉన్ తన స్నేహితులతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని వారు గుర్తు చేసుకొన్నారు. తమ దేశానికి ప్రత్యర్థి దేశాలకు చెందిన విద్యార్థులతో కూడ కిమ్ జంగ్ ఉన్ స్నేహంగా ఉండేవాడని వారు గుర్తు చేశారు.

ఓడిపోవడం నచ్చదు

ఓడిపోవడం నచ్చదు

కిమ్‌కు ఓడిపోవడం అస్సలు నచ్చదని అతని చిన్ననాటి స్నేహితులు గుర్తు చేశారు. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడని వారు చెప్పారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. కోపమెక్కువ, ఇతరులకు తన వల్ల ఇబ్బందులు ఎదురైనా కిమ్ జంగ్ పట్టించుకోడన్నారు. ఆడవారిపై కేకలు వేసేవాడని వారు గుర్తు చేసుకొన్నారు.

English summary
Kim Jong-un’s former classmates struggle to reconcile their memories of the “good friend” who was obsessed with basketball with the North Korean dictator
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X