వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూలై 27 నుంచి కిమ్ సోదరి మిస్సింగ్... నియంతే చంపేశారా.. అధికారం కోసం ఎందాకైనా..!

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన సొంత నీడనే నమ్మరు. అలాంటిది మరొకరు తన పదవిని ఎగురేసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకుంటారా..? ఉత్తరకొరియా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన చేసిన సొంత చెల్లెలు కిమ్ యో జాంగ్ పరిస్థితి ఏమవుతుంది..? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. కొన్ని అంతర్జాతీయ పత్రికలు ఆమె పరిస్థితి ఏంటా అన్నదానిపై రకరకాల విశ్లేషణలతో కథనాలు రాస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె అదృశ్యం అవడంతో పలు అనుమానాలు తెరపైకొస్తున్నాయి.

Recommended Video

Kim Jong Un సోదరి Kim Yo Jong Missing, సోదరి కిమ్ యో జాంగ్‌ను కిమ్ హతమార్చాడా..? || Oneindia Telugu
 కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ మిస్సింగ్..?

కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ మిస్సింగ్..?

ఈ ఏడాది మొదట్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంకు గురైనట్లు వార్తలు వచ్చాయి.అంతేకాదు ఒకానొక సమయంలో కిమ్ కనిపించకపోతే ఆయన మృతి చెందాడని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ సమయంలో తన సోదరి కిమ్ యో జాంగ్‌ ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ మేరకు ప్రయత్నాలు కూడా జరిగాయి.

అయితే ఒక్కసారిగా కిమ్ మళ్లీ ప్రజాజీవితంలో కనపడటంతో ఆయనపై వచ్చిన ప్రచారానికి తెరపడింది. మళ్లీ గత నెలలో కిమ్ అనారోగ్యానికి గురయ్యారని కోమాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు తన సోదరి కిమ్ యో జాంగ్‌కు అధికారాలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ కిమ్ పొలిట్ బ్యూరో సమావేశంలో కనిపించినట్లు ఫోటోలు విడుదలయ్యాయి. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ కనిపించడం లేదనే వార్త ఆందోళనకు గురిచేస్తోంది. కిమ్ యో జాంగ్ ఒక నెలరోజులుగా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. జూలై 27నుంచి ఆమె కనిపించడం లేదని యూకే ఎక్స్‌ప్రెస్ ఒక కథనంను రాసుకొచ్చింది.

 సోదరిని కిమ్ హతమార్చాడా..?

సోదరిని కిమ్ హతమార్చాడా..?

కిమ్ యో జాంగ్ అదృశ్యంపై చాలా అనుమానాలు తలెత్తుతున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్‌కు నచ్చని వారెవరైనా సరే పాతాళానికి పోవాల్సిందేనన్న సిద్ధాంతం ఫాలో అయ్యే వ్యక్తి అని చాలామంది సన్నిహితులు చెబుతుంటారు. అది కుటుంబ సభ్యులైనా మరెవరైనా సరే.. తనకు ఎదురు తిరిగితే భూమిపై నూకలు చెల్లినట్లే అన్న విధంగా కిమ్ వ్యవహరిస్తారని దక్షిణ కొరియా నేతలు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలోనే కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌ ఒక్కసారిగా పాపులర్ అవడంతో కిమ్ సహించలేకపోయి ఉంటారని, ఆమెను హతమార్చి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు కొరియా యూనివర్శిటీ ప్రొఫెసర్ నామ్ సంగ్ వూక్.

 కిమ్‌ సోదరికి శిక్షణ ఇస్తున్నారంటూ మరో వాదన

కిమ్‌ సోదరికి శిక్షణ ఇస్తున్నారంటూ మరో వాదన

ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. కిమ్ యో జాంగ్‌ను కిమ్‌లానే తయారయ్యేలా శిక్షణ ఇస్తున్నారని మరో ప్రొఫెసర్ సంగ్ యూ లీ చెప్పారు. ఉత్తరకొరియాను శాసించాలంటే నియంతలా వ్యవహరించాలని కిమ్‌ కంటే ఇంకా ప్రమాదకరంగా ఆమె మారాలన్న ఉద్దేశంతో ఆమేరకు శిక్షణ ఇస్తున్నారంటూ ఆప్రొఫెసర్ న్యూయార్క్ పోస్టుతో చెప్పారు. అంతేకాదు అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ ఎలా అయితే ప్రమాదకరంగా మారాడో... అంతకంటే ప్రమాదకరంగా సోదరి కిమ్ యో జాంగ్ తయారయ్యేలా శిక్షణ ఇస్తున్నట్లు కొన్ని ప్రొఫెసర్ సంగ్ యూ లీ చెప్పారు. ఈమెకు పగ్గాలు వస్తే తన సోదరుడు కిమ్, తండ్రి, తాతల కంటే ప్రమాదకరమైన నియంతగా మారే అవకాశాలున్నాయని చెప్పారు.

కిమ్‌కు అడ్డొస్తే ఖేల్ ఖతం

కిమ్‌కు అడ్డొస్తే ఖేల్ ఖతం

ఇక కిమ్ పైశాచికత్వం సాధారణంగా ఉండదనేది బహిరంగ రహస్యం. తనకు ఎదురొచ్చిన వారు ఎవరైనా సరే చంపడమే ఫిలాసఫీగా పెట్టుకున్న వ్యక్తి. ఇందుకు మంచి ఉదాహరణ తన తండ్రి మరణించిన తర్వాత ఉత్తరకొరియా బాధ్యతల చేపట్టాలని కిమ్ బావ జాంగ్ సాంగ్ తైక్ భావించారు. ఆ ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనతో పాటు ఆయన్ను కూడా అత్యంత కిరాతకంగా అంతమొందించారట కిమ్. ఆ సమయంలో జాంగ్ సాంగ్ తైక్ వర్గం కిమ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి కిమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కుక్క కంటే నీచంగా ప్రవర్తిస్తాడని వారు మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులకు వారి కుటుంబాన్ని కూడా కిమ్ అంతమొందించారనే వార్తలు వచ్చాయి.

మొత్తానికి కిమ్ యో జాంగ్ బతికే ఉన్నారా.. ఉంటే ఎక్కడున్నారు.. గత నెలరోజులుగా కనిపించని కిమ్ యో జాంగ్ పై అనేక కథనాలు వస్తున్నాయి. కిమ్ నిజంగానే ఆమెను అంతమొందించారా లేక ఆమె శిక్షణ తీసుకుంటుండటంతో ప్రజాజీవితంలో కనిపించడం లేదా అనే వాటికి సమాధానం కాలమే చెప్పాలి.

English summary
NORTH KOREA's leader Kim Jong-un could have executed his own sister, it has been claimed after she has been missing for more than a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X