• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kim Jong Un: ఉత్తర కొరియాకు పెద్ద కష్టం.. బయటపడే మార్గాలు వెతకాలన్న కిమ్ జోంగ్ ఉన్..

|

ఉత్తర కొరియాకు పెద్ద కష్టమొచ్చి పడింది.దేశంలో ఆహార కొరత నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పార్టీ కేంద్ర కమిటీతో సమావేశమై దీనిపై చర్చించారు. దేశం ఆహార కొరత నుంచి బయటపడే మార్గం కనుగొనాలని పార్టీ నేతలను,అధికారులను కోరారు. పరిస్థితులు దిగజారకముందే వ్యవసాయ ఉత్పత్తులను పెంచే మార్గాలను కనుగొనాలని సూచించారు. నిజానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియా ఆదాయం కొంత మేర పెరిగినా... ఆహార ఉత్పత్తి తగ్గిపోవడంతో దేశం ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది.

  Kim Jong Un: ఆకలితో అలమటించే.. North Korea Food Shortage ఆహార సంక్షోభం!! || Oneindia Telugu

  Kim Jong-un: చిక్కిపోయిన 'కిమ్'-లీకైన ఫోటోల్లో సన్నగా-ఉ.కొరియా అధినేతకు ఏమైనట్లు-అనారోగ్యమే కారణమా?Kim Jong-un: చిక్కిపోయిన 'కిమ్'-లీకైన ఫోటోల్లో సన్నగా-ఉ.కొరియా అధినేతకు ఏమైనట్లు-అనారోగ్యమే కారణమా?

  ఆహార కొరత నెలకొనే ప్రమాదం...

  ఆహార కొరత నెలకొనే ప్రమాదం...

  ఈ ఏడాది మొదటి ఆర్నెళ్ల కాలానికి సంబంధించి దేశ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఇటీవల వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది. గతేడాది పోలిస్తే ఈ ఏడాది దేశ పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం పెరిగిందని సమావేశంలో కిమ్ పేర్కొన్నారు. ఇందుకోసం కృషి చేసినవారిని అభినందించారు. అదే సమయంలో దేశంలో ఆహార కొరత నెలకొనే ప్రమాదం ఉందని... దీన్ని అధిగమించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ వివరాలను వెల్లడించింది.

  లాక్‌డౌన్ పొడగించే యోచన...

  లాక్‌డౌన్ పొడగించే యోచన...

  ఉత్తర కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని గతంలో ఆ దేశం ప్రకటించుకుంది. కానీ ఆ ప్రకటన ఎవరికీ పెద్దగా నమ్మశక్యంగా అనిపించలేదు. పైగా కోవిడ్‌ను సంపూర్ణంగా నిర్మూలించేందుకు దేశంలో మరికొంంత కాలం లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని తాజా సమావేశంలో కిమ్ జోంగ్ సంకేతాలిచ్చారు. దీన్నిబట్టి ఉత్తర కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా లేదన్న ప్రకటనలో నిజం లేదనే అనిపిస్తోంది. ప్రభుత్వం లాక్‌డౌన్ పొడగించే యోచనలో ఉండటంతో... ప్రజలు అందుకు సిద్దంగా ఉండాలని కిమ్ జోంగ్ పేర్కొన్నారు.

  ఎందుకీ ఆహార సంక్షోభం..

  ఎందుకీ ఆహార సంక్షోభం..

  వేసవిలో తుఫాన్లు,వరదల కారణంగా ఉత్తర కొరియాలో పంటలన్నీ నాశనమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో పొరుగు దేశాలతో సరిహద్దులు కూడా మూతపడటంతో ఆహార వాణిజ్యం కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియాకే చెందిన కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కూడా గతేడాది ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలో ఈ ఏడాది మిలియన్ టన్నుల మేర ఆహార కొరత నెలకొనవచ్చునని తెలిపింది. ఉత్తర కొరియాలో 1990లో తీవ్రమైన కరువు కారణంగా వేలాది మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుత ఆహార సంక్షోభం నేపథ్యంలో మళ్లీ ఆనాటి పరిస్థితులు పునరావృతమవుతాయా అన్న ఆందోళన నెలకొంది.

  సన్నబడ్డ కిమ్...

  సన్నబడ్డ కిమ్...

  కిమ్ జోంగ్ ఉన్ సన్నబడ్డ ఫోటోలు ఇటీవల బయటకొచ్చిన సంగతి తెలిసిందే. చబ్బీగా ఉండే కిమ్ ఒక్కసారిగా ఇంతలా బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్యంపై పెద్ద చర్చే జరుగుతోంది. అనారోగ్యం కారణంగానే ఆయన సన్నబడ్డారా లేక ఫిట్‌నెస్ కోసం కావాలనే బరువు తగ్గారా అన్నది అంతుచిక్కడం లేదు. గతేడాది కొన్ని నెలల పాటు ఆయన కనిపించకుండా పోవడంతో... అనారోగ్యమే కారణమన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కిమ్ చనిపోయారని... ఆయన సోదరి అధ్యక్ష బాధ్యతలు చేపడుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా గతేడాది జూన్ 6న కిమ్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఉత్తర కొరియా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన చాలా చిక్కిపోయి కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

  English summary
  North Korea's leader Kim Jong Un told the plenary meeting of the Workers' Party of Korea on Wednesday that the country could face a tense food situation due to floods triggered bytyphoons , the state-run KCNA news outlet reported
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X