వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను పరుగెత్తిస్తా: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరికలు

ఉత్తర కొరియాను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశానికి సమీపంలో తమ యుద్ధ విమానాలతో బాంబులు వేయించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియాను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశానికి సమీపంలో తమ యుద్ధ విమానాలతో బాంబులు వేయించారు.

బాంబులు జారవిడిచారు

బాంబులు జారవిడిచారు

ఉత్తర కొరియా సరిహద్దుల్లోని దక్షిణ కొరియా ప్రాంతంలో శక్తివంతమైన బంబులను విమానాలు జారవిడిచాయి. జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ఓ ఖండాతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే అమెరికా ఈ బాంబులను పరీక్షించాలని తన సైన్యానికి ఆదేశించిందని తెలుస్తోంది.

తీవ్రంగా స్పందించిన కిమ్ జాంగ్ ఉన్

తీవ్రంగా స్పందించిన కిమ్ జాంగ్ ఉన్

అమెరికా బాంబులు వేసిన విషయం తెలుసుకున్న కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా స్పందించారు. తాను ఒక్క క్షిపణి పరీక్షను చేస్తే అమెరికా వెనక్కు పరిగెడుతుందని మండిపడ్డారు.

మా దేశ సరిహద్దుల్లో ఉండటమా

మా దేశ సరిహద్దుల్లో ఉండటమా

ఇదో అనాగరిక చర్య అని కిమ్ జాంగ్ ఉన్ అభివర్ణించారు. తమ దేశ సరిహద్దుల్లో అమెరికా బాంబర్లు, అమెరికా యుద్ధ విమానాలు ఉండటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐరాస కూడా ఖండించింది

ఐరాస కూడా ఖండించింది

కాగా, అంతకుముందు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని ఐక్య రాజ్య సమితి కూడా ఖండించింది. తమ దేశంపై ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడంతో జపాన్, దక్షిణ కొరియాలు ఐరాసను సంప్రదించాయి. తక్షణం భద్రతా మండలిని సమావేశపరిచి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరాయి.

English summary
KIM JONG UN vowed North Korea would never stop its nuclear weapons program as he warned of America’s “final doom”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X