వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో ప్రత్యక్షమైన కిమ్ విమానం...మరో రహస్య పర్యటనలో ఉత్తరకొరియా అధ్యక్షుడు..?

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యా పర్యటనకు రహస్యంగా వెళ్లారా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సాధారణంగా కిమ్ జాంగ్ ఉన్ లేదా ఉత్తరకొరియా ఉన్నతాధికారులు వినియోగించే విమానం ఒక్కటి రష్యాలోని వ్లాదివోస్టోక్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. దీంతో కిమ్ జాంగ్ ఉన్న మరో రహస్య పర్యటన చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మూడుగంటల పాటు అక్కడే ఉన్న విమానం ఆ తర్వాత ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ విమానంలో ఉత్తరకొరియా ఉన్నతాధికారులు రష్యాకు వెళ్లిఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సెప్టెంబర్‌లో వ్లాదివోస్టోక్‌లో జరగనున్న తూర్పు ఆర్థిక సమాఖ్యలో కిమ్ పాల్గొనే అవకాశమున్నందున... ఆ ఏర్పాట్ల కోసం అధికారులు వెళ్లే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ విమానంలో కిమ్ ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని ఓ వర్గం మీడియా చెబుతోంది.

 Kims Aircraft spotted in Russia

అయితే మీడియాలో వస్తున్న కథనాలపై రష్యా స్పందించింది. అసలు ఉత్తరకొరియాకు సంబంధించిన విమానం రష్యాలో ల్యాండ్ అయినట్లు తమ దగ్గర సమాచారం లేదని వివరణ ఇచ్చింది.

చైనాకు చెందిన అధికార బృందం మాత్రమే వ్లాదివోస్టోక్‌కు వస్తున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.మరోవైపు కిమ్‌కు సంబంధించిన విమానం వస్తున్నట్లు తమ దగ్గర కూడా సమాచారం లేదని రష్యాలోని ఉత్తరకొరియా ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతకుముందు కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం పంపినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం వేదికగా అయినా లేదా ఇరుదేశాలు వేర్వేరుగా అయినా చర్చలు జరపాలని భావించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు కిమ్ జాంగ్ ఉన్ రహస్యంగా చైనాకు రైలులో వెళ్లారు. అక్కడ చర్చలు జరిపాక మరోసారి అధికారికంగా చైనా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సింగపూర్‌కు వెళ్లేందుకు చైనానే తమ విమానంను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సారి కిమ్ నిజంగానే రష్యాలో పర్యటిస్తే... ఆయన పర్యటిస్తున్న నాలుగో దేశంగా రష్యా నిలుస్తుంది.

English summary
North Korean leader Kim Jong-un might make yet another foreign trip soon. On Monday, July 9, an aircraft presumed to be that of Kim was spotted in Vladivostok in Russia, giving rise to the speculation that preparations were perhaps underway for the leader to visit Russia in some time, South Korean news agency Yonhap said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X